Kantara 2 update : గతేడాది ఓ మామూలు సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి, బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన సినిమా 'కాంతార'. ప్రస్తుతం 'కాంతార-2' రూపొందుతోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ కాదని 'కాంతార' మొదటి భాగానికి ప్రీక్వెల్అని దర్శకుడు రిషభ్ శెట్టి ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదే.. డైరెక్టర్ రిషభ్ శెట్టి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.
Kantara 2 update : 'కాంతార-2' కోసం అది నేర్చుకుంటున్న డైరెక్టర్ రిషభ్ శెట్టి! - kantara 2 Shooting
Kantara 2 update : 'కాంతార-2' ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే?
మరింత లోతుగా భూతకోల నేపథ్యం..
kantara 2 Shooting : ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ పనులు జరుగుతున్నాయి. రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'కాంతార' పార్ట్ 1ను తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే రెండో భాగం కోసం మాత్రం భారీగానే బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నారట నిర్మాత చలువే గౌడ. అలాగే ఇందులో భూతకోల నేపథ్యాన్ని మరింత లోతుగా చూపనున్నారట. ఇక వచ్చే ఏడాది దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. దర్శకుడు రిషభ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో 'కాంతార-2'కి సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రకృతి నేపథ్యంలో తెరకెక్కిన తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను 'కాంతార' ప్రీక్వెల్‌లో చూపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ఆస్కార్ రేసులో..
kantara Oscar : గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల మధ్య కన్నడలో రిలీజైన ఈ మూవీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో దీన్ని మరిన్ని భాషల్లో విడుదల చేయాలని డిమాండ్‌లు కూడా వచ్చాయంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో మేకర్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక విడుదలైన ప్రతి భాషలో భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందీ సినిమా. ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల్లోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది. భారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన పది సినిమాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం.