Chandramukhi2 Kangana: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన 'చంద్రముఖి' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీల్లో 'చంద్రముఖి' సినిమా వస్తే చాలు ప్రేక్షకులు అలా అతుక్కుపోతారు. అంత క్రేజ్ సాధించింది ఈ సినిమా. తాజాగా దానికి సీక్వెల్ చంద్రముఖి-2 రూపొందుతోంది. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రముఖి చిత్రం దర్శకుడు పి.వాసునే తెరకెక్కిస్తున్నారు. దీనికి కీరవాణి స్వరాలు అందించనున్నారు.
'చంద్రముఖి' సీక్వెల్లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్! - కంగనా రనౌత్ కొత్త సినిమా
'చంద్రముఖి' సినిమా మంచి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా 'చంద్రముఖి-2' సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం.
హారర్ర్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మైసూర్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్కడ లారెన్స్, రాధికపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా 'చంద్రముఖి 2' చిత్రంలో సంచలన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
కంగనా రనౌత్ '2008 ధామ్ ధూమ్' అనే చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అగ్ర కథానాయకగా ఎదిగారు. తమిళంలో ఇటీవల విడుదలైన 'తలైవి' చిత్రంలో జయలలితగా నటించి ప్రశంసలు అందుకున్నారు. దీంతో 'చంద్రముఖి 2' చిత్రంలో ఎలాంటి పాత్రలో నటించనున్నారన్నది సర్వత్రా ఆసక్తిగా నెలకొంది.