నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోంది. శుక్రవారం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'బింబిసార' అనే టైటిల్(Bimbisara First Look)ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో 'బింబిసార' మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం షేర్ చేసింది. తనపై దండెత్తి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కల్యాణ్‌రామ్ కనిపించారు.
Bimbisara First Look: పవర్ఫుల్ పాత్రలో కల్యాణ్‌రామ్ - Bimbisara
నందమూరి హీరో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా కొత్త దర్శకుడు విశిష్ట్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందనుంది. శుక్రవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'బింబిసార' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో కొత్త లుక్(Bimbisara First Look)లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు కల్యాణ్ రామ్.
Bimbisara First Look: పవర్ఫుల్ పాత్రలో కల్యాణ్‌రామ్
ఈ చిత్రం ద్వారా వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌కు జంటగా కేథరిన్, సమ్యుక్తా మేనన్ నటించనున్నారు. చింతరంజన్‌భట్ స్వరాలు అందించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కె.హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇదీ చూడండి:NTR Jayanthi: బాలయ్య 'శ్రీరామ దండకం' రిలీజ్
Last Updated : Dec 23, 2022, 4:44 PM IST