తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేను హిందీ హీరోని.. తెలుగు చిత్రాల్లో నటించను' - జాన్​ అబ్రహాం ప్రభాస్​ సలార్​

ప్రభాస్​ 'సలార్'​ సినిమాలో నటించట్లేదని స్పష్టం చేశారు బాలీవుడ్​ హీరో జాన్​ అబ్రహాం. హీందీలో తప్ప మరే ఇతర చిత్రాల్లో నటించనని పేర్కొన్నారు.

john abraham
జాన్​ అబ్రహాం

By

Published : Mar 31, 2022, 2:15 PM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న 'సలార్'​ సినిమాలో బాలీవుడ్​ ప్రముఖ నటుడు జాన్​ అబ్రహాం నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. 'సలార్​'లో నటించట్లేదని స్పష్టం చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం 'అటాక్'​. ఏప్రిల్​ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను.. "సలార్‌లో మీ సపోర్టింగ్‌ రోల్‌ చేయనున్నారంట కదా నిజమేనా?" అని ఓ విలేకరి ప్రశ్నించారు.

"నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు చేయను. నేను హిందీ హీరోని మాత్రమే. సెకండ హీరో, సహనటుడి పాత్రలు పోషించను. సినిమాను వ్యాపారంగా చూసే ఇతర నటులలాగా ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటించే ప్రసక్తే లేదు." అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం జాన్‌ వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారాయి. 'జిస్మ్‌‌'తో వెండితెరకు పరిచయ్యారు జాన్‌ అబ్రహం. 'ధూమ్‌', 'రేస్‌', 'సత్యమేవజయతే', 'సత్యమేవజయతే-2'.. వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు.

ఇదీ చూడండి: 'కేజీఎఫ్​ 2'లో ఆ డైలాగ్స్​ హీరో యశ్​ రాసినవే!

ABOUT THE AUTHOR

...view details