తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే? - Jawan boxoffice collections

Jawan Shahrukh : జవాన్​లో హీరోయిన్​గా నటించిన నయనతార.. ఈ చిత్రంపై అసంతృప్తిగా ఉందని బాలీవుడ్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక నయన్​ హిందీ సినిమాలు చేయదని అంటున్నారు. అసలేం జరిగిందంటే..

Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే?
Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే?

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 1:02 PM IST

Jawan Shahrukh : బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్​.. ప్రస్తుతం 2023 జనవరిలో పఠాన్​తో క్రియేట్ చేసిన రికార్డ్స్​ను ఈ వినాయక చవితికి బ్రేక్​ చేసే పనిలో ఉన్నారు. పఠాన్​తో వెయ్యి కోట్లు అందుకున్న ఆయన.. ఇప్పుడు జవాన్​తో ఆ రూ.1000కోట్ల మార్క్​ను క్రాస్​ చేసే దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఈ వీకెండ్​ నాటికి రూ.1000 కోట్ల(Jawan movie box office Collections) మార్క్​ను పక్కా టచ్ చేస్తుంది.

ఇక ఈ చిత్రం విజయంలో షారుక్​తో పాటు అట్లీ, నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురి స్టార్​ డమ్​ కూడా బాగా ఉపయోగపడింది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం.. నయనతార గురించి చేస్తున్న కొన్ని వార్తలు మాత్రం సోషల్​ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జవాన్ సినిమా విషయంలో నయన్​ కాస్త అసంతృప్తిగా ఉందని వాళ్లు రాస్తున్నారు. ముఖ్యంగా అట్లీపై అసంతృప్తిగా ఉందట.

చిత్రంలో నయన్ కన్నా దీపికా పదుకొణె పాత్ర బాగా హైలైట్ అయిందని, అందుకే నయన్ హర్ట్​ అయిందని అంటున్నారు. ఇక నయన్​ బాలీవుడ్ చిత్రాలకు ఇప్పట్లో సైన్ చేయదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఇంకో వర్గం చెబుతోంది. ఇదంతా కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తూ.. దీపికకు క్రెడిట్​ ఇస్తున్నారని అంటోంది.

వాస్తవానికి జవాన్ సినిమాను చూసిన నార్త్ ఆడియెన్స్​ కూడా నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్​ను బాగా అస్వాదిస్తున్నారని ఆ వర్గం చెబుతోంది. అట్లీ ఆమె క్యారెక్టర్​ను మంచిగా డిజైన్ చేశారని, అయినా జవాన్ విషయంలో నయన్ నిజంగా హర్ట్ అయి ఉంటే.. జవాన్ మూవీ కలెక్షన్స్, సినిమాపై వచ్చిన ప్రశంసల గురించి ఇన్​స్టాలో థ్యాంక్ ఎందుకు​ చెబుతుందని అంటున్నారు. కాబట్టి దీని బట్టి చూస్తే.. జవాన్ సినిమా సక్సస్​ను నయన్ కంప్లీట్​గా ఎంజాయ్ చేస్తుందని అర్థమవుతోంది. కావాలనే నయన్​ అప్సెట్​ అయిందని​ మీడియాలో పుట్టించిన పుకారని క్లారిటీ అవుతోంది.

Jawan Oscar : షారుక్ 'జవాన్'​కు ఆస్కార్​ రేంజ్ సత్తా ఉందా?

Shah Rukh Khan Thalapathy Vijay : షారుక్​ - విజయ్​ కాంబోపై క్లారిటీ ఇచ్చేసిన అట్లీ.. రూ.1500 కోట్లు టార్గెట్​!

ABOUT THE AUTHOR

...view details