బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్-తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది నటి నయనతార ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చెన్నైలో చిత్రీకరించబోతున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో దాదాపు 200-250 మంది మహిళలు పాల్గొంటారని తెలిసింది. వీరిందరిని ముంబయిని నుంచి తీసుకురానున్నారట. మొత్తం ఏడు రోజుల పాటు ఈ హై యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగనుందని టాక్. మరి ఈ హై వోల్టేజ్ సీన్లో వారితో కలిసి షారుక్ ఎలాంటి సాహసం చేయబోతున్నారా అనే ఆసక్తి ప్రస్తుతం అభిమానుల్లో మెదులుతోంది. దీంతోపాటే రాబోయే మూడు వారాల పాటు షారుక్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట.
"ఇక ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ.. "జవాన్ యూనివర్సల్ స్టోరీ. ఇలాంటి యూనిక్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నందుకు క్రెడిట్ అంతా అట్లీకే దక్కుతుంది. అతడితో కలిసి పనిచేయడం ఓ అద్భుతమైన గొప్ప అనుభూతి. నేను లవ్ యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఇష్టపడతాను. ఇటీవలే వచ్చిన టీజర్ సాంపుల్ మాత్రమే" అని షారుక్ అన్నారు.