తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అతడితో రిలేషన్​షిప్​.. ఎట్టకేలకు జాన్వీ నిజం ఒప్పుకుందిగా! - జాన్వీకపూర్​ రిలేషన్​షిప్​

హీరోయిన్ జాన్వీకపూర్​ ఓ వ్యక్తితో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఆమె మాట్లాడింది. తన మాటలు వింటుంటే.. రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమేనని అర్థమవుతోంది!

Janvikapoor boyfriend
అతడితో రిలేషన్​.. ఎట్టకేలకు జాన్వీ నిజం ఒప్పుకుందిగా

By

Published : Nov 7, 2022, 12:05 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఒర్హాన్‌తో యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్​ డేటింగ్​లో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. బీటౌన్‌ ఫంక్షన్స్‌లో వీరిద్దరూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. పార్టీలు, డిన్నర్‌లు, విదేశీ టూర్‌లు.. ఇలా ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. రిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గానూ మారాయి. ఈ నేపథ్యంలో 'మిలీ' సినిమా ప్రమోషన్స్​లో పాల్గొన్న జాన్వీ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని ఆమె పేర్కొంది.

"ఒర్హాన్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అతడితో ఉంటే నేను ప్రతిక్షణం ఆనందంగానే ఉంటా. అన్ని విషయాల్లోనూ ఎంతోకాలం నుంచి అండగా నిలిచాడు. అతడిని ఎంతో నమ్మాను. అతడు నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుంది" అని తెలిపారు.కాగా, జాన్వి చెప్పిన మాటలు వింటుంటే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమే అయి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇదీ చూడండి:ఆ స్టార్ హీరో సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్​గా కమల్​హాసన్​!

ABOUT THE AUTHOR

...view details