తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జనగణమన సినిమా షూటింగ్​ షురూ.. హీరోయిన్​ ఎవరంటే? - జనగణమన

పూరీ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా నిర్మిస్తున్న 'జనగణమన' షూటింగ్​ ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్​ ఎవరో ప్రకటిస్తూ మూవీటీమ్​ అప్​డేట్​ను రివీజ్​ చేసింది. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్​ ఎవరో తెలుసా?

d
ed

By

Published : Jun 4, 2022, 6:48 PM IST

స్టార్​ డైరెక్టర్​ పూరీ జగన్నాధ్​ కలల ప్రాజెక్ట్​ జనగణమన ఎట్టకేలకు పట్టాలెక్కింది. విజయ దేవరకొండ కథానాయకుడిగా పూరీ కనెక్ట్స్​, శ్రీకర స్టూడియోస్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్​ శనివారం మొదలైంది. ఇందుకు సంబంధించిన అప్​డేట్​​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సహనిర్మాత ఛార్మీకౌర్​ సోషల్​మీడియా వేదికగా ఈ అప్​డేట్​ను షేర్​ చేసింది.

వీడియోలో కనిపించిన భారీ సెట్​, తారాగణం, సాంకేతిక బృందాన్ని చూసి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఆగస్టు 23న విడుదల కానున్నట్లు మూవీటీమ్​ ప్రకటించింది. ప్రస్తుతం విజయ్​ దేవరకొండ-పూరీ కాంబినేషన్​లో లైగర్​ తెరకెక్కుతోంది. అనన్య పాండే కథానాయికగా ఉన్న ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్​ టైసన్​ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి :చీర కట్టినా.. బికినీ వేసినా.. ఈ ముద్దుగుమ్మ అందాలు కెవ్వు కేకే!

ABOUT THE AUTHOR

...view details