Jailer Gold Coins : సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' పాన్ ఇండియా, గ్లోబల్ బాక్సాఫీస్ ముందు ఎంతటి సెన్సేషనల్ సృష్టించిందో తెలిసిన విషయమే. దాదాపు రూ.650కోట్లకు పైగా వసూళ్లను అందుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఈ చిత్రం విజయోత్సాహంతో ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. పెట్టిన బడ్జెట్‌కు రెండు మూడు రెట్లు లాభాలు ఎక్కువ రావడంతో ఆయన ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఈ సినిమా కోసం పని చేసిన ప్రతిఒక్కరికీ కాస్ట్లీ బహుమతులు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. పేద పిల్లల గుండె చికిత్సల కోసం కూడా కొంత డబ్బును అందించారు. అలా ఈ సారి ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. వారందరికీ ప్రత్యేకంగా వంటకాలు చేయించి మరీ భోజనాలు కూడా పెట్టారు.
అంతకుముందు హీరో రజనీకాంత్‌కు కాస్ట్లీ బీఎండబ్ల్యూ కారు, దర్శకుడు నెల్సన్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఖరీదైన పోర్సే కార్లను బహుమతిగా ఇచ్చారు. అలాగే చెక్‌లను కూడా ఇచ్చారు. ఇక అంతటితో ఆగకుండా.. తాజాగా ఈ సినిమా కోసం పని చేసిన 300 మందికి గోల్డ్ కాయిన్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.