అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్వించే బుల్లితెర లేడీ కమెడియన్ రోహిణి. వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న ఈ జబర్దస్త్ అమ్మడును రౌడీ రోహిణి అని కూడా అంటారు. బుల్లితెరపై నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. కామెడీ పంచులతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు కామెడీ షోస్ చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్‌తో ఆకట్టుకుంటున్న రోహిణి.. ఎక్కడుంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. అలా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే.. తాజాగా ఆమె.. చాలామంది లైఫ్‌లో లవ్ స్టోరీస్ ఉన్నట్లే తన జీవితంలో కూడా ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రేమ తనకు విషాదాన్ని మిగిల్చిందని ఎమోషనల్ అయింది.
తెలుగు బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానల్ ఓ సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో సింగర్స్, యాక్టర్స్, స్పెషల్ పెర్ఫార్మన్స్‌లతో అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించింది.