తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కనులారా వీక్షిద్దాం'.. రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటో షూట్‌పై బాలీవుడ్​ నటి కామెంట్స్​ - It is artistic freedom

రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్​ తారలు జాన్వీ కపూర్​, విద్యాబాలన్​ స్పందించారు. ఈ విషయంలో అతనికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేశారు ఈ హీరోయిన్లు.

Ranveer Singh photoshoot
'కనులారా వీక్షిద్దాం'.. రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటో షూట్‌పై బాలీవుడ్​ నటి కామెంట్స్​

By

Published : Jul 30, 2022, 5:19 PM IST

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రణ్​వీర్​ ఆ ఫొటోలను షేర్​ చేసినప్పటి నుంచి మద్దతు తెలుపుతూ కొందరు.. విమర్శస్తూ మరికొందరు స్పందిస్తున్నారు. తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోలపై బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​ స్పందించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను విలేకరులు ప్రశ్నించగా.. ఆసక్తికర కామెంట్స్​ చేసింది. 'అది ఒక కళాత్మక స్వేచ్ఛ. దానికోసం విమర్శించడం, విశ్లేషించడం సరైన పద్ధతి కాదు' అని జాన్వీ పేర్కొంది. కాగా పాప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా రణ్‌వీర్ సింగ్ ఫొటోషూట్‌ చేసిన విషయం తెలిసిందే.

మరో బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ సైతం రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటో షూట్‌పై స్పందించింది. అతనికి మద్దతుగా నిలిచింది. 'ఒకరి భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టడానికి ప్రయత్నించడం అర్థరహితం. అవతలి వ్యక్తి చేసే పని మీకు నచ్చకపోతే కళ్లు మూసుకోండి. అంతే కానీ ఇంకో వ్యక్తిని మీరు నిర్దేశించలేరు. ఎందుకంటే అప్పుడు మీరు చేసే పని.. నాకు నాకు నచ్చకపోవచ్చు. ఫొటోషూట్​ వల్ల సమస్య ఏమోచ్చింది. ఒక నటుడు ఇలా చేయడం ఇదే మొదటి సారి. కనులారా వీక్షిద్దాం' అని విద్యాబాలన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో విషాదం.. ఎన్టీఆర్​ ఫ్యాన్​ మృతి

ABOUT THE AUTHOR

...view details