తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెడికల్ మాఫియా నేపథ్యంలో 'NTR 30' మూవీ.. స్క్రిప్ట్ మార్చే పనిలో కొరటాల? - కొరటాల శివ ఎన్టీఆర్​ స్టోరీ లైన్​

టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న 'NTR 30' సినిమా స్టోరీకి సంబంధించి ఓ అప్డేట్​ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మెడికల్ మాఫియాకు సంబంధించిన అంశాన్ని కొరటాల యాడ్​ చేయనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్​ మార్చే పనిలో ఆయన ఉన్నారట.

NTR 30 Movie Story Line
NTR 30 Movie Story Line

By

Published : Nov 3, 2022, 7:17 PM IST

NTR 30 Movie Story Line: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న 'NTR 30' సినిమాపై గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్నామధ్య కొరటాలతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మూవీ టీమ్ ఇటీవలే క్లారిటీ ఇవ్వడంతో సినిమా క్యాన్సిల్ అవ్వలేదని అర్థమైంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయని సినీ వర్గాల టాక్.

ఇప్పుడీ సినిమాలో మెడికల్ మాఫియాకు సంబంధించిన అంశాన్ని పొడిగిస్తూ ఒక లైన్​ను ఎన్టీఆర్​కు చెప్పారట కొరటాల. ఆ పాయింట్ తారక్​కు నచ్చడంతో దానిపై కసరత్తు ప్రారంభించారట మూవీ టీమ్. ఇది దాదాపు మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో కార్పొరేట్ వైద్యం సవాళ్లను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారట. కార్పొరేట్ వైద్యం పేదల పాలిట అందని ద్రాక్షలా ఎందుకు మారింది? అందుకు గల కారణాలను డెప్త్​లోకి వెళ్లి చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట కొరటాల.

నిజానికి ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండనుందని అందరూ అనుకున్నారు. అందుకే ఫస్ట్ లుక్, టీజర్ ఆ లెవల్​లో విడుదల చేశారు. ఇప్పుడీ కథకు మెడికల్ మాఫియా బ్యాగ్రౌండ్ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులకు ఎలాగో ఇంకో మూడు నెలలు పట్టడంతో వచ్చే ఏడాదిలో సినిమా పనులు ప్రారంభం అవుతాయని ఫిల్మ్ సర్కిల్​లో టాక్. మరి ఈ సినిమా రిలీజ్ టైమ్​కు ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, ఎన్టీఆర్-కొరటాల కాంబో మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details