తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'టాప్​గన్ : మెవరిక్​' రేంజ్​లో 'ఫైటర్​' టీజర్- యాక్షన్​ మోడ్​లో హృతిక్, దీపిక - ఫైటర్ మూవీ టీజర్ అప్​డేట్

Hritik Roshan Fighter Teaser : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా ఓ ఫుల్​ ఆన్​ యాక్షన్​ మోడ్​లో ఉన్న మూవీలో లీడ్ రోల్​ ప్లే చేస్తున్నారు. ఫైటర్​ అనే సినిమాలో ఆయన కనిపించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్​ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Hritik Roshan Fighter Teaser
Hritik Roshan Fighter Teaser

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 12:15 PM IST

Updated : Dec 8, 2023, 12:31 PM IST

Hritik Roshan Fighter Teaser :బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్​, దీపికా పదుకుణె లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఫైటర్​'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్​ శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం ఫుల్​ యాక్షన్​ సీన్స్​తో నిండిపోయింది. గాల్లో ఫైటర్ జెట్స్​తో హృతిక్, దీపికా చేసిన విన్యాసాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

డైలాగ్స్ లేకుండా యాక్ష‌న్ సీన్స్​తో టీజర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. మమ్మల్ని కనుగొనాలంటే? మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని పట్టుకోవాలంటే? మీరు వేగంగా ఉండాలి. మమ్మల్ని ఓడించాలంటే? మీరు జోక్ చేయాలి. అన్న ట్యాగ్​లైన్స్​తో వీడియో మొదలైంది. ఆ తర్వాత హృతిక్ రోషన్, దీపికా పదుకుణె ఫుల్ ఆన్ యాక్షన్​ మోడ్​లోకి దిగి యుద్ధ విమానాలను నడిపారు. వీటిని చూసిన ఫ్యాన్స్​​ అత్యద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) అనే పాత్రలో క‌నిపించ‌నున్నారు. మరో స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే) మెరవనుంది. ఇక గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక బాలీవుడ్ మ్యూజిక్​ సెస్సేషన్​ విశాల్​- శేఖర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ముచ్చటగా మూడోసారి :హీరో హృతిక్ - డైరెక్టర్​ సిద్ధార్థ్ కాంబోలో రానున్న మూడో సినిమా ఫైటర్. ఇదివరకు ఈ కాంబోలో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. ఇక హృతిక్ గత చిత్రం విక్రమ్ వేద.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది. దీంతో ఈ సినిమా ఊహించిన స్థాయిలో కలెక్షన్లు వసూల్ చేయలేదు. దీంతో హృతిక్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్ పనుల్లో ఈ మూవీ బిజీ బిజీగా ఉంది.

Hritik Wishes Ntr: 'యుద్ధభూమిలో కలుద్దాం'.. 'దేవర'కు బాలీవుడ్ స్టార్ స్పెషల్ విషెస్!

Heroines Action Movies : హీరోయిన్లా మజాకా.. ఒకరు తుపాకీ పట్టుకుని.. మరొకరు యుద్ధ విమానం ఎక్కేసి..

Last Updated : Dec 8, 2023, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details