KGF 3 Shooting: 'కేజీయఫ్', 'కేజీయఫ్-2' చిత్రాలతో కన్నడ చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చారు నటుడు యశ్, దర్శకుడు ప్రశాంత్‌నీల్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన 'కేజీయఫ్-2' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, 'కేజీయఫ్-2' ఎండ్‌కార్డ్స్‌లో 'కేజీయఫ్-3' ఉన్నట్లు చిత్రబృందం చిన్న హింట్ ఇచ్చింది. దీంతో 'కేజీయఫ్-3' అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే శనివారం ఉదయం నుంచి 'కేజీయఫ్-3' అప్‌డేట్స్‌పై కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. 'కేజీయఫ్-3' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచి షూట్ ప్రారంభించే అవకాశం ఉందని నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పినట్లు ఆయా వార్తల్లో రాసుకొచ్చారు. .
KGF 3: నిన్న అలా.. నేడు ఇలా.. ఇంతకీ ఉందా లేదా? - kgf 3 updates
KGF 3 Shooting: 'కేజీయఫ్-3' గురించి వస్తోన్న వరుస కథనాలపై హోంబలే సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. ఏమన్నారో తెలుసుకుందాం..
కాగా, 'కేజీయఫ్-3' గురించి వస్తోన్న వరుస కథనాలపై హోంబలే సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. "నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. ప్రస్తుతం మా చేతిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. మా దృష్టంతా వాటిపైనే ఉంది. కాబట్టి, హోంబలే సంస్థ ఇప్పట్లో 'కేజీయఫ్-3'ని పట్టాలెక్కించాలనుకోవడం లేదు. ఒకవేళ ఆ సినిమా షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం" అని కార్తిక్ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ‘మార్వెల్ యూనివర్స్’ తరహాలో 'కేజీఎఫ్ 3'.. సరికొత్త లుక్‌లో సల్మాన్ భాయ్