Adipurush overseas Market : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన 'ఆదిపురుష్' మూవీ.. జూన్ 16వ తేదీన విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది. అలాగే సినిమా బిజినెస్‌కు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా జరుపుకుంటోంది. ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. దీంతో ఇక్కడితో పాటు వరల్డ్‌వైడ్‌గా ఆదిపురుష్ సందడే కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీ ఓవర్సీస్ బుకింగ్స్ గురించి ఓ షాకింగ్ వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యూఎస్ఏలో ఈ చిత్రంపై హాలీవుడ్ సినిమా 'ది ఫ్లాష్' ప్రభావం గట్టిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రం కూడా జూన్ 16నే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫలితంగా 'ఆదిపురుష్'కు చిత్రానికి చాలా తక్కువ లొకేషన్లే దొరికినట్లు సమాచారం అందింది.
అసలీ ఈ ఆదిపురుష్‌పై 'ది ఫ్లాష్' మూవీ ఎఫెక్ట్ ఏమాత్రం ఉందనే దానికి ఓ ఊదాహరణను కూడా చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. కొద్ది రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న నాని 'దసరా'.. రిలీజ్‌కు పది రోజుల ముందు 200 లొకేషన్స్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ 'ఆదిపురుష్' చిత్రానికి మాత్రం.. సరిగ్గా పది రోజుల సమయం ఉండగా.. కేవలం 130 లొకేషన్లలోనే అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. 'ఫ్లాష్' మూవీ ప్రభావం వల్ల ఓవర్సీస్లో 'ఆదిపురుష్' కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..