హీరో నాని సమర్పణలో రూపొందిన సినిమా హిట్ 2. అడివిశేష్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఈ విజయంపై తానెలా ఎంజాయ్ చేశారు? హిట్ వర్స్ భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది? గూఢచారి 2 సినిమా సహా పలు విషయాల గురించి చెప్పారు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం..
'హిట్-2' విజయాన్ని నిన్న రాత్రి మీరెలా ఎంజాయ్ చేశారు?
శేష్: నేను, నాని, విశ్వక్‌సేన్, శైలేష్ కొలను కలిసి 'హిట్' వర్స్‌కు సంబంధించిన తదుపరి కార్యాచరణ గురించి చర్చించుకున్నాం. అలాగే, ఇతర చిత్రబృందంతో కలిసి డ్యాన్స్ చేశాం. మా డ్యాన్స్ చూసి మీనాక్షి నవ్వింది.
'హిట్-2' హిందీ వెర్షన్‌కు మీరే డబ్బింగ్ చెబుతున్నారా?
శేష్: నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతా. త్వరలోనే హిందీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.
'హిట్'వర్స్‌లో మహేశ్‌బాబుని హీరోగా పెట్టండి.. సినిమా మరోస్థాయికి వెళ్తుంది. ఆయనతో మీరొక థ్రిల్లింగ్ స్టోరీ చేస్తే చూడాలని ఉంది..?
శేష్: ఇది ఆయనకు సూట్ అవుతుందో లేదో ఆలోచించాలి. ఈరోజు ఉదయం ఆయన ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడారు. నా విషయంలో గర్వంగా ఉన్నానని చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక సోదరుడిగా ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చా. అలాగే, ఆయనకు 'హిట్-2' చూపించాలని ఆశగా ఎదురుచూస్తున్నా.
'గూఢచారి-2' ఎప్పుడు?
శేష్: ప్రస్తుతం 'హిట్-2' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా. త్వరలో హిందీ వెర్షన్ ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. ఆ తర్వాతనే 'గూఢచారి-2'.