తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

స్పీడ్​ పెంచిన పవన్.. చేతిలో ఐదు సినిమాలు.. మరో యంగ్​ డైరెక్టర్​కు ఛాన్స్.. - పవన్​ కల్యాణ్​లేటెస్ట్​ వార్తలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. మ‌రో టాలీవుడ్‌ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నారు. ఎప్పుడో గ్రీన్​ సిగ్నల్​ కూడా ఇచ్చేశారట. ఆ వివరాలు..

hero pavan kalyan new movie with ravanasura director sudheer varma
hero pavan kalyan new movie with ravanasura director sudheer varma

By

Published : Mar 19, 2023, 6:58 AM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కెరీర్​ ఆరంభం నుంచి ఏడాదికొక సినిమా చేసిన పవన్.. ఒక్కసారిగా స్పీడు పెంచారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ నాలుగింటిలో రెండు.. ఇప్పుడికే సెట్స్​పై ఉన్నాయి. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్​లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

అయితే తాజాగా పవన్​ కల్యాణ్​.. మరో సినిమాను లైన్​లో పెట్టారు. యంగ్​ డైరెక్టర్​ సుధీర్​ వర్మతో ఓ సినిమా చేయబోతున్నారు. రవితేజ హీరోగా నటించిన రావణాసుర చిత్ర ప్రమోషన్స్​లో పవన్​ కల్యాణ్​తో తాను సినిమా చేయడం నిజమేనంటూ సుధీర్​ వర్మ వెల్లడించారు. చాలా క్రితమే పవన్​తో సినిమా ఫిక్స్​ అయిందని ఆయన తెలిపారు. ఈ సినిమా మెయిన్​ స్టోరీ ఐడియా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​దేనని చెప్పారు. ఆయన చెప్పిన ఐడియాను డెవలప్​ చేయడంతో పాటు ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూవీ మాత్రం సెట్స్​పైకి రావడానికి కాస్త సమయం పట్టనుందని తెలిపారు. పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం కమిట్​మెంట్స్​ తర్వాతే ఈ సినిమా షూటింగ్​పై క్లారిటీ వచ్చే అవకాశముందని వెల్లడించారు.

ప్రస్తుతం డైరెక్టర్​ క్రిష్​ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీశ్​ శంకర్ డైరెక్షన్​లో​ ఉస్తాద్​ భగత్​సింగ్​ సినిమాలు చేస్తున్నారు పవన్​ కల్యాణ్​. వీటితో పాటు సముద్ర ఖని డైరెక్షన్​లో వినోధయ సీతమ్​ రీమేక్​కు ఇటీవలే పవన్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఈ రీమేక్​ చిత్రంలో సాయి ధరమ్​ తేజ్​.. మరో హీరోగా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రీకరణ.. ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్​ చిత్రాలు లీక్​ అయ్యి.. సోషల్​మీడియాలో వైరల్​ కూడా అయ్యాయి. ఈ మూడు కాకుండా.. సాహో ఫేమ్​ సుజిత్​తో గ్యాంగ్​ స్టర్​ సినిమా కూడా చేయనున్నారు పవన్​.

మ‌రోవైపు ర‌వితేజ హీరోగా సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రావ‌ణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్​, అను ఇమ్మాన్యుయేల్​, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరో సుశాంత్​ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవితేజ, అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details