దర్శకుడు ప్రశాంత్ నీల్ నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయబోతున్నారని నిన్నమొన్నటి వరకు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ ప్రచారం రూటు మారింది. ఇటీవలే ప్రశాంత్.. ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృభూమి కోసం పోరాడిన ఓ యోధుడి కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఇందులో మరో హీరోకు చోటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోనే నాని కనిపించనున్నారంటూ కొత్త ప్రచారం మొదలైంది! సోషల్‌మీడియాలో ఇప్పుడు దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-త్రివిక్రమ్ సినిమాలో నాని కనిపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. నాని అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
నాని.. మొన్న మహేశ్‌తో.. ఇప్పుడు ఎన్టీఆర్‌తోనా!
హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్ సినిమాల్లో నాని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్‌మీడియా ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
నాని.. మొన్న మహేశ్‌తో.. ఇప్పుడు ఎన్టీఆర్‌తోనా
కాగా, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ప్రశాంత్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉండగా.. తారక్ కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: లైఫ్‌లో కాంప్రమైజ్ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్' అంటూ సామ్ పోస్ట్