తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హిట్- 4'లో బాలయ్య?.. జూన్ 10 కోసం డైరెక్టర్​ శైలేశ్​ వెయిటింగ్! - బాలకృష్ణ చిత్రాలు

Balakrishna HIT Universe : 'హిట్ యూనివర్స్' పేరుతో దర్శకుడు శైలేశ్ కొలను రూపొందిస్తున్న ఫ్రాంచైజ్‌లో ఇప్పటికే 'హిట్: ది ఫస్ట్ కేస్', 'హిట్: ది సెకండ్ కేస్' సినిమాలు వచ్చాయి. మూడో సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్నారు. నాలుగో సినిమాకు కూడా కథ రెడీ అయిపోయిందని తెలుస్తోంది. అందులో బాలకృష్ణ హీరోగా నటించనున్నారట!

hero nandamuri balakrishna in hit franchise
hero nandamuri balakrishna in hit franchise

By

Published : Jun 2, 2023, 3:40 PM IST

Balakrishna Movies : సంక్రాంతి బరిలోకి దిగి 'వీరసింహారెడ్డి' చిత్రంతో టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ణ.. సూపర్​ హిట్​ అందుకున్నారు. గతేడాది విడుదలైన 'అఖండ' సినిమాతో మంచి ఫాంలో ఉన్న బాలయ్య.. అదే దూకుడు ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్టార్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'భగవత్​ కేసరి' అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు సమాచారం. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అయితే అదేరోజు మరో ప్రకటన కూడా రాబోతుందట. అదే 'హిట్​-4' అనౌన్స్​మెంట్​ అంట.

Hit Franchise Telugu : 'హిట్: ది ఫస్ట్ కేస్' సినిమాతో దర్శకుడు శైలేశ్ కొలను సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. ఆ తరవాత గతేడాది 'హిట్: ది సెకండ్ కేస్'​ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదల సమయంలోనే హిట్ యూనివర్స్ గురించి శైలేశ్ కొలను ప్రకటన చేశారు. పలువురు హీరోలతో వరుసగా హిట్ ఫ్రాంచైజ్‌ను తీయనున్నట్టు చెప్పారు. ఈ ఫ్రాంచైజ్‌లో చాలా సినిమాలు వస్తాయన్న శైలేశ్.. అన్ని కేసులను కలుపుతూ ఒక సినిమా ఉంటుందని కూడా తెలిపారు.

Balakrishna HIT Universe : అయితే ఈ 'హిట్ యూనివర్స్‌'లో భాగంగా రాబోతున్న మూడో సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో 'సైంధవ్' సినిమా తెరకెక్కిస్తున్న శైలేశ్ కొలను.. ఈ సినిమా పూర్తిచేసిన తరువాత 'హిట్ 3'ని పట్టాలెక్కిస్తారు. అయితే, ఆ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే 'హిట్ 4'ను కూడా ప్లాన్ చేస్తున్నారట శైలేశ్.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను హీరోగా అనుకుంటున్నారట. ఇప్పటికే బాలకృష్ణకు శైలేశ్ కథ వినిపించారట. బాలయ్యకు కథ కూడా నచ్చిందని సమాచారం. అయితే, ఇంకా ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. అంతా శైలేశ్ అనుకున్నట్టు జరిగితే జూన్ 10న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని వినికిడి.

NBK 108 Update : మరోవైపు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ ఇప్పటికే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇక యంగ్ హీరోయిన్ శ్రీలీల.. బాలయ్యకు కుమార్తెగా కనిపించనున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details