తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అఖిల్ విషయంలో సైలెంట్​గా నాగార్జున!

అఖిల్ త్వరలోనే భారీ బడ్జెట్​ చిత్రం 'ఏజెంట్'తో ఆడియెన్స్​ను పలకరించబోతున్నారు. అయితే అఖిల్​ విషయంలో హీరో నాగార్జున సైలెంట్​గా ఉంటున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలు..

Nagarjuna
అఖిల్ విషయంలో సైలెంట్​గా నాగార్జున

By

Published : Apr 20, 2023, 10:31 PM IST

అక్కినేని నాగార్జున.. టాలీవుడ్​లో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు మాస్ ఇటు క్లాస్​ అభిమానులను సొంతం చేసుకున్నారాయన. అయితే మిగతా వారసుల్లానే తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్​ను కూడా బడా స్టార్లుగా తీర్చిదిద్దటానికి నాగార్జున గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ అది అనుకున్నంత స్థాయిలో జరగలేదనే చెప్పాలి! చైతూ లవర్​ బాయ్​గా.. మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్​లో రాణిస్తున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం తన కెరీర్​లో హైయెస్ట్​ బడ్జెట్​తో 'కస్టడీ' చిత్రం చేస్తున్నారు. ఇది ఏమైనా చైతూ ఇమేజ్​ను మారుస్తుందేమో చూడాలి.

ఇకపోతే భారీ అంచనాలతో లాంచ్ అయ్యారు అఖిల్​. ఆయన కూడా ఇప్పటివరకు కెరీర్​లో భారీ హిట్​ను అందుకోలేకపోయారు. రీసెంట్​గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో తన కెరీర్​లో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ఆయన కూడా లవర్​ బాయ్​ ఇమేజ్​తోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఏజెంట్​తో మాస్ అండ్​ భారీ హిట్​ను అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మేకోవర్​, లుక్స్​, స్టైల్​ అన్నీ మార్చేశారు. అయితే అఖిల్ విషయంలో నాగార్జున కాస్త సైలెంట్​గా ఉంటున్నట్లు కనిపిస్తోంది. గ్రాండ్​గా రూపొందిన 'అఖిల్', 'హలో' చిత్రాల ప్రమోషన్స్​లో కనిపించిన ఆయన.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల విషయాల్లోనూ కాస్త కనిపించారు. మొదటి రెండు సినిమాల కలెక్షన్లు డీలా పడినప్పటికీ.. మజ్ను, బ్యాచిలర్​ సినిమా వూసూళ్ల విషయంలో నిర్మాతలు సేఫ్! కానీ 'ఏజెంట్' అలా కాదు. ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్​తో రూపొందించారని టాక్​ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, టీజర్, ట్రైలర్​ కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే అఖిల్ లాస్ట్​ హిట్​ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కలెక్షన్స్​.. 'ఏజెంట్​' సినిమా బడ్జెట్​లో సగం అయినా ఉంటుందో లేదో కానీ.. ఈ సారి మాత్రం అఖిల్​తో అంత భారీ బడ్జెట్​తో సినిమా తీయడం చిన్న విషయం కాదు. మరి ఇంత భారీ సినిమా గురించి, ప్రమోషన్స్​ విషయంలో ఇంతవరకు నాగ్ మాత్రం ఏమీ మాట్లాడినట్లు కనిపించలేదు! సైలెంటుగానే ఉంటున్నారు. ప్రమోషన్స్​లో ఇంతవరకు భాగస్వామ్యం అవ్వలేదు. 'ఏజెంట్' ప్రీ రిలీజ్​ ఈవెంట్‌కు కూడా చీఫ్ గెస్ట్​గా ప్రభాస్ వస్తారని అంటున్నారే కానీ.. నాగ్​ పేరు వినపడట్లేదు. చూడాలి మరి ప్రీ రిలీజ్​కు ఏమైనా వస్తారా? లేదా మూవీ సక్సెస్​ అయితే మాట్లాడతారా అనేది.

ఇదీ చూడండి:మన హీరోలు.. ఒక్కరిగా కాదు.. ఇద్దరుగా వచ్చేస్తున్నారు..

ABOUT THE AUTHOR

...view details