Ashok Galla debut movie: "పాన్ ఇండియా చిత్రాల గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు. ముందు నటుడిగా నేనొక చోట నిలబడాలి అనుకుంటున్నా. అందుకు మంచి కథలు, పాత్రలు చేయడమే నా ముందున్న కర్తవ్యం" అన్నారు అశోక్ గల్లా. మహేష్‌బాబు మేనల్లుడైన ఆయన.. 'హీరో' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు అశోక్ గల్లా. ఆ విశేషాలివి..
'హీరో' సినిమా ఫలితం సంతృప్తినిచ్చిందా?
" ఈ చిత్ర సక్సెస్‌తో వృత్తిపరంగా సంతృప్తి చెందాను. మామూలుగా పండగ రోజుల్లో ప్రేక్షకులు బాగా థియేటర్లకు వచ్చేవారు. కొవిడ్ పరిస్థితుల వల్ల ఎక్కువగా రాలేదని కొద్దిగా నిరుత్సాహం ఉంది. వాస్తవానికి కొవిడ్ మార్చిలో ఎక్కువవుతుంది అనుకున్నాం. జనవరిలోనే బాగా పెరిగిపోయింది. ఏదేమైనా ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి కదా.. అందుకే మరీ అంతగా బాధపడలేదు".
నటుడిగా ఎలాంటి ప్రశంసలు దక్కాయి? మహేష్‌బాబు ఏమన్నారు?
"సినిమా చూసిన ప్రతిఒక్కరూ నటన పరంగా చాలా మెచ్చుకున్నారు. వాళ్ల ప్రశంసలు వింటుంటే నాపై నాకే మరింత నమ్మకం వచ్చింది. మోటివేషన్ ఎక్కువైంది. ఇంకా బాగా చేయాలన్న తపన రెట్టింపైంది. మహేష్‌బాబు సినిమా చూసి.. 'ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు..' అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. సినిమా గురించే చాలా మాట్లాడారు. కంటిన్యుటీలో చిన్నపాటి తప్పిదాలు ఉంటే చెప్పారు".
ప్రయోగాత్మక కథలతో ప్రయాణించాలనుందా? కమర్షియల్ హీరోగా నిలబడాలనుందా?