తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మాస్ అవతార్‌లో యంగ్​ 'హీరో' అశోక్ గల్లా.. మేనల్లుడికి మహేశ్​ స్పెషల్​ విషెస్​ - అశోక్​ గల్లా హీరో సినిమా

'హీరో' సినిమా తర్వాత మరో కొత్త మూవీతో మాస్ అవతార్​లో టాలెంటెడ్ హీరో అశోక్ గల్లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన టీజర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీరు ఆ వీడియోను చూసేయండి.

hero ashok galla new movie teaser mahesh babu special wishes to him
hero ashok galla new movie teaser mahesh babu special wishes to him

By

Published : Apr 5, 2023, 5:10 PM IST

హీరో సినిమాతో ప్రేక్షకులను అలరించిన దివంగత సూపర్​ స్టార్​ కృష్ణ మనమడు, మహేశ్​ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మరో కొత్త సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. నేడు(ఏప్రిల్ 5) అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా హీరో మహేశ్​ బాబు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. తన మేనల్లుడి కొత్త చిత్రానికి సంబంధించిన టీజర్​ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్‌ గల్లా 'మాస్‌ అవతార్‌'లో కనిపించబోతున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్టు సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలపై టీమ్​ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.

సూపర్​ స్టార్​ కృష్ణ మనమడిగా, మహేశ్​ బాబు మేనల్లుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు హీరో అశోక్ గల్లా. 'భ‌లే మంచి రోజు', 'శ‌మంత‌క‌మ‌ణి', 'దేవ‌దాస్' లాంటి విభిన్న చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా 'హీరో' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. 2022లో రిలీజైన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటించింది. అయితే ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోగా.. నష్టం కూడా వాటిల్లిందని వార్తలు కూడా వినిపించాయి.

ఈ విషయంపై హీరో అశోక్ గల్లా సైతం ఇటీవల స్పందించారు. "2022లో నా జీవితంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఆందోళకరమైన పరిస్థితుల మధ్య ఎంతో కాలంగా ఉన్న నా కల సాకారం అయ్యింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మా కుటుంబానికి.. మాటలకందని నష్టం కూడా జరిగింది. దాంతో పాటు మీ అంచనాలు అందుకోలేనేమో? అని కొంత భయపడుతున్న నాకు.. సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రతీ అప్డేట్​కు మీరు ఇచ్చిన ఆదరణ చూసి కొండంత బలం వచ్చింది. మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సులు తోడుగా ఉన్నంతవరకూ నాకు నచ్చిన ఈ సినిమా రంగంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా" అంటూ అశోక్ గల్లా రాసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details