Harishshankar Chiranjeevi movie: ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్‌కు మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. 'రౌడీ అల్లుడు', 'దొంగ మొగుడు' తరహాలో తనతో చక్కటి సినిమా చేయాలని చిరంజీవి హరీశ్ శంకర్‌ను కోరారు. 'ఆచార్య' చిత్రం ఏప్రిల్ 29న విడుదలను పురస్కరించుకొని హరీశ్ శంకర్... మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాలతో ప్రత్యేక ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఆచార్య' చిత్ర విశేషాలను వెల్లడిస్తూనే మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు.
హరీశ్శంకర్కు చిరు బంపర్ ఆఫర్.. ఆ జోనర్లో సినిమా! - harishshankar chiranjeevi
Harishshankar Chiranjeevi movie: సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన మనసులోని ఓ మాటను బయటపెట్టారు. 'రౌడీ అల్లుడు', 'దొంగ మొగుడు' తరహాలో చక్కటి సినిమాను దర్శకుడు హరీశ్శంకర్తో చేయాలని ఉందని చెప్పారు.
పదేళ్లు రాజకీయాల్లో ఉండి ఆ తర్వాత వరుసగా రెండు సీరియస్ కథలతో సినిమా చేయడం వల్ల ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని పంచలేకపోయానని పేర్కొన్న చిరంజీవి.... హరీశ్ శంకర్ లాంటి దర్శకుడు మంచి కథ తయారు చేస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చిరంజీవి ప్రకటనతో ఉబ్బితబ్బిబ్బైన హరీశ్ శంకర్.... ప్రశ్నించడానికి వస్తే వరమిచ్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో చేస్తున్న 'భవదీయుడు భగత్ సింగ్' పూర్తి కాగానే.. మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారుచేస్తానని హరీశ్ శంకర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: Acharya First review: మెగాఫ్యాన్స్కు పూనకాలే.. ఫుల్ మాస్ మసాలా!