తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మాది 'పాన్​ తెలుగు' సినిమా.. వందమంది ఒకేసారి నవ్వుకోవడంలో ఆ కిక్కే వేరు' - హ్యాపీ బర్త్​డే హీకరోయిన్​

తెలుగు సినీ పరిశ్రమకు 'మత్తు వదలరా' చిత్రంతో పరిచయమైన దర్శకుడు రితేశ్​ రాణా. లావణ్య త్రిపాఠి హీరోయిన్​గా ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం 'హ్యాపీ బర్త్​డే' జులై 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

happybirthday movie
happybirthday movie

By

Published : Jul 3, 2022, 6:56 AM IST

HappyBirthday Movie Director Ritesh: పరిశ్రమకి కొత్తతరం దర్శకులొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొత్త రకమైన కథలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగమే 'మత్తు వదలరా'తో పరిచయమైన దర్శకుడు.. రితేశ్‌ రాణా. ఆయన తెరకెక్కించిన రెండో చిత్రమే 'హ్యాపీ బర్త్‌డే'. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించారు. ప్రచార చిత్రాలతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేశ్‌ రాణా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

పాన్‌ తెలుగు సినిమా అంటున్నారు. ఎందుకలా?
ప్రచారంలో భాగంగా పెట్టిన ఉపశీర్షిక అది. సరదాగా నవ్వుకోవడానికే ఆ ప్రయత్నం. ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని చెప్పడానికి సరదాగా పాన్‌ తెలుగు సినిమా అన్నాం.

పుట్టిన రోజు చుట్టూ తిరిగే కథ.. అనే ఆ పేరు పెట్టారా?
లావణ్య త్రిపాఠి పాత్ర పేరు హ్యాపీ. ఆమె పుట్టినరోజు కథలో కీలకమైన ఘట్టాలు జరుగుతాయి. అందుకే ఆ పేరు పెట్టాం. లావణ్య ఇలాంటి సినిమా చేయలేదు. ఆమె బయట చాలా సరదాగా ఉంటారు. ఒక టీవీ షోలో తనని చూసి ఈ పాత్ర రాశా. ఆమెకి ఈ పాత్ర కొత్తగా ఉండటంతో పాటు బాగా నప్పింది. మిగతా పాత్రలు చాలా బాగుంటాయి. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య.. ఇలా చాలా మంది నటులున్నారు. మా అందరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. దానికితోడు ఆ పాత్రలకి తగ్గ నటులు కావడంతోనే వాళ్లని ఎంపిక చేశాం. ఈ సాంకేతిక బృందంతో దాదాపు పదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం.

.

ఇంటింటికీ గన్‌ అంటున్నారు టీజర్‌లో. ఇంతకీ ఈ కథలో ఏం చెప్పారు?
ఒక ఊహాజనిత ప్రపంచంలో సాగే కామెడీ కథ ఇది. మనందరి దగ్గరా గన్‌ ఉండటం అనేది అసాధ్యం. గన్‌ పాలసీ, ఇంటింటికీ గన్‌ అంటూ అబద్ధపు ప్రపంచాన్ని సృష్టించాం. ఈ తరహా చిత్రాలకి సర్రియల్‌ కామెడీ జోనర్‌ అనే పేరుంది. కొత్త రకమైన ఈ తరహా చిత్రాలు తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. కథ లాజికల్‌గానే ఉంటుంది, ఆ కథ సాగే ప్రపంచమే మనకు కొత్తగా ఉంటుంది. ఈ జోనర్‌ విషయంలో సందేహాలు రాకూడదనే ప్రేక్షకులకు ప్రచార కార్యక్రమాల్లోనే వివరంగా చెప్పాం. ఈ కథ చాప్టర్లుగా సాగుతుంది. విజువల్‌ కామెడీ, వ్యంగ్యం, పేరడీ,... ఇలా కామెడీలో ఉన్న చాప్టర్లన్నిటినీ ఒకొక్కక్కటిగా స్పృశించాం. ఇలాంటి సినిమాలు థియేటర్‌లో ఆస్వాదించడానికి చాలా బాగుంటాయి. ఒక చోట వందల మంది కలిసి నవ్వుకోవడంలో ఓ కిక్‌ ఉంటుంది.

రకరకాల జోనర్లని ఎంచుకుంటూ చిత్రాలు చేస్తున్నారు.కొత్తదనం కోసమేనా?
నేనేం రాసినా అది కొత్తగా ఉండాలనుకుంటా. 'మత్తు వదలరా' పరిమిత వ్యయంతో నాకొక ఎంట్రీ కార్డ్‌లాగా ఉండాలని నన్నునేను నిరూపించుకునేందుకు చేశా. అది మంచి విజయం సాధించింది. ఈసారి ఓ కొత్త రకమైన సినిమానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నా. ఒక ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లేతో దీన్ని తీర్చిదిద్దాం. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

తదుపరి ప్రాజెక్టుల విశేషాలేమిటి?
రెండు కథలు పక్కా అయ్యాయి. అవి కొత్త తరహావే. ఏది ముందుకు తీసుకెళ్లాలనేది ఇంకా ఖరారు కాలేదు.

ఇవీ చదవండి:డైరెక్టర్​ లింగుస్వామి విషయంలో.. ఆ తప్పు ఎందుకు జరిగిందో చెప్పిన రామ్​

శ్రేయా ఘోషల్‌ గొంతుతో 'కల్లు సీసా'.. పొన్నియిన్‌ సెల్వన్‌ పోస్టర్‌.. 'గార్గి' విడుద‌ల తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details