ఆయన పేరు మూడక్షరాలే. కానీ, ఆ పేరు వెనుక అక్షరాలతో కూడా వర్ణించలేని స్టార్‌డమ్ ఉంది. అభిమానులకు ఆయన ఆరాధ్యదైవం. నిర్మాతల పాలిట కామధేనువు. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. బస్సులో కండక్టర్‌గా ఈల వేసే స్థాయి నుంచి.. థియేటర్లలో ఈలలేయించుకునే దిగ్గజ నటుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. తన మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. సూపర్‌స్టార్‌గా సినీచరిత్రలో ఓ చరిత్ర లిఖించుకున్నారు. అయితే ఆయనకు సూపర్‌స్టార్ బిరుదు ఎప్పుడు వచ్చిందంటే..
అవకాశాల కోసం ఎదురుచుస్తున్న రజనీకాంత్ అప్పుడే ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. అలా 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా ఎదిగారు. వచ్చింది చిన్న పాత్రే అయినా తన స్టైల్, మేనరిజమ్స్‌తో అదరగొట్టేసేవారు. ఓ సారి 'పదినారు వయదినిలె'(తెలుగులో పదహారేళ్ల వయసు) కోసం కమల్ చాలా కష్టపడుతున్నారు. సుమారు 60 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కానీ అందులో రజనీ పాత్ర షూటింగ్ మూడు రోజుల్లో అయిపోయింది. అదీ విలన్ పాత్ర. కానీ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో రజనీకాంత్ డైలాగ్‌లు, మేనరిజమ్స్‌కు చప్పట్లే చప్పట్లు. అలా రజనీ అప్పుడు మరో అరుదైన ఘనతనూ దక్కించుకున్నారు. 1975లో 'అపూర్వరాగంగళ్'(తమిళం)లో అరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత రెండోడి కన్నడలో 'సంగమ', మూడోడి 'అంతులేని కథ'.. ఇలా తన తొలి మూడు చిత్రాలు మూడు భాషల్లో నటించారు. ఆ