తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కాబోయే భర్తతో హన్సిక ఫొటో లీక్‌.. స్పందించిన బ్యూటీ - హన్సిక ఇన్​స్టా అకౌంట్​

వచ్చే నెలలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్న హన్సిక.. సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన ఓ కథనంపై స్పందించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 5, 2022, 11:04 AM IST

నటి హన్సిక (Hansika) త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌తో వచ్చే నెలలో ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో వీరిద్దరూ బోట్‌లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి ఇది బయటకు వచ్చింది.

దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన ఖాతా కాదని.. ఫేక్‌ అకౌంట్‌ అని రిప్లై ఇచ్చారు. ఇది లీక్‌ చేసిన ఫొటో లేదా మార్ఫింగ్‌ ఫొటో అయి ఉండొచ్చని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్‌ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్‌ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

లీక్​ అయిన ఫొటో

ABOUT THE AUTHOR

...view details