Gunturu Kaaram First Single Leaked : లీక్‌ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అస్సలు ఆగట్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇదీ అడ్డంకిగా మారింది. ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ కన్నా ముందే లీకేజీ రాయుళ్ల చేతికి చిక్కి.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. టాలీవుడ్లో ఇప్పుడీ సమస్యను సంగీత దర్శకుడు తమన్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు!
ఈ మధ్య కాలంలో గమనిస్తే.. తమన్ కంపోజ్ చేసిన సాంగ్సే ఎక్కువగా విడుదలకు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ 'జరగండి జరగండి' సోషల్ మీడియాలో ప్రత్యేక్షమై అభిమానులతో పాటు మూవీటీమ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో నిర్మాత దిల్ రాజ్ టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి.. సాంగ్ అఫీషియల్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు.
ఇది జరిగి కొద్ది రోజులు కూడా కాలేదు.. అంతలోనే ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమా విషయంలోనూ మళ్లీ ఇదే సమస్య రిపీట్ అయింది. నిజానికి ఓ సాంగ్ కోసం ఏ హీరో అభిమానులు కూడా వెయిట్ చేయని రేంజ్లో 'గుంటూరు కారం' పాట కోసం మహేశ్ అభిమానులు ఎదురు చూశారు. దీంతో అదుగో ఇదిగో అంటూ వచ్చిన మూవీటీమ్.. అన్ని నెలల నిరీక్షణకు తెరదించుకూ రీసెంట్‌గానే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ రెడీ చేసింది. కానీ ఇప్పుడు మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. తమన్ కంపోజ్ చేసిన పాటకు సంబంధించి ఓ అడియో క్లిప్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.