తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గోపిచంద్​ రామబాణమా.. నరేశ్​ ఉగ్రరూపమా.. - గోపిచంద్ రామబాణం ఓపెనింగ్స్​

ఇంకో రెండు రోజుల్లో గోపిచంద్​ రామబాణం, నరేశ్​ ఉగ్రం చిత్రాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో?

Ramabanam ugram
గోపిచంద్​ రామబాణమా.. నరేశ్​ ఉగ్రరూపమా..

By

Published : May 3, 2023, 9:35 AM IST

ఈ శుక్రవారం ఎప్పటిలాగే కొత్త చిత్రాలు రిలీజయ్యేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం'. ఈ రెండు సినిమాలు మే 5న ఆడియెన్స్​ ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు.. సక్సెస్​ఫుల్​ కాంబో అనే ట్యాగ్​తో రాబోతుండటం వల్ల.. ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో అని కాస్త ఆసక్తిగానే ఉంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి హీరోలిద్దరితో పాటు ఆయా మూవీటీమ్స్​​.. ప్రమోషన్స్​లో జోరుగా పాల్గొంటూ ఆడియన్స్​కు సినిమా రీచ్ చేసేందుకు శ్రమిస్తున్నాయి. ఈ చిత్రాలపై ఆడియెన్స్​లో కాస్త ఇంట్రెస్ట్​ ఉన్నప్పటికీ.. మరీ ఎక్కువ స్థాయిలో బజ్ ఏమీ లేనట్టుగా కనిపిస్తోంది! ఎందుకంటే గోపీచంద్ 'రామబాణం' ట్రైలర్ చూస్తుంటే ఆకట్టుకున్నప్పటికీ.. రొటీన్​ మాస్​ ఎంటర్​టైనర్​లానే కనిపిస్తుందని అంటున్నారు ప్రేక్షకులు! కానీ ఈ చిత్రం గోపిచంద్​-శ్రీవాస్(లక్ష్యం, లౌక్యం)​ లాంటి సక్సెస్​ఫుల్ కాంబోలో రూపొందడం.. కాస్త కలిసొచ్చే అంశం. మరి ఈ చిత్ర ఓపెనింగ్స్​ ఎలా ఉంటాయో..

అలాగే రూట్​ మార్చి సీరియస్​ కథలపై ఫోకస్​ పెట్టిన అల్లరి నరేశ్.. ఈ సారి 'ఉగ్రం'తో రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలో నరేశ్ తన ఇంటెన్స్​ యాక్టింగ్​తో ఆకట్టుకున్నారు. ఇది చూసిన మూవీ లవర్స్​.. 'నాంది' లాంటి కథతోనే మరో యాంగిల్​ చూపించబోతున్నారని.. ఓ అంచనాకు వచ్చేశారు! అయితే ఇక్కడ నరేశ్​ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం కాబట్టి.. సినిమాపై కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. కానీ.. మరోవైపు గోపిచంద్​ లాంటి మాస్ హీరో సినిమా ఉండటం వల్ల.. 'ఉగ్రం'కు లిమిటెడ్​ థియేటర్స్​ దక్కి ఉండొచ్చు! మరోవైపు ఇప్పటికే బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష' కూడా ఇంకా కొన్ని థియేటర్స్​లో తన జోరును కొనసాగిస్తోంది. కాబట్టి ఉగ్రం సింగిల్​గా వచ్చి ఉంటే ఓపెనింగ్స్​ మరి కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉండేదేమో.

ఫస్ట్ డే టాక్​పైనే.. ఏదేమైనప్పటికీ.. దర్శకనిర్మాతలు ఊహించిన రేంజ్​లో బుకింగ్స్​ అవుతున్నాయో లేదే క్లారిటీగా తెలియదు కానీ.. రెండు చిత్రాలకు.. ఓపెనింగ్స్​ కాస్త తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఫస్ట్​ డే టాక్​పైనే కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో. ఎవరుపై చేయి సాధిస్తారో..

రామబాణం విషయానికొస్తే.. 'లక్ష్యం', 'రామరామ కృష్ణకృష్ణ', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'లౌక్యం' తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీవాస్‌.. దీన్ని తెరకెక్కించారు. యాక్షన్​ అండ్ కామెడీ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్​గా నటించింది. ఇక ఉగ్రం సినిమా విషయానికొస్తే.. విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. మిర్నా మేనన్‌ కథానాయిక.

ఇదీ చూడండి :యాంకర్​ అనసూయ ఫుల్​​ బిజీ.. చేతినిండా సినిమాలే!

ABOUT THE AUTHOR

...view details