తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Film Fare Awards 2023 : ఫిల్మ్​ ఫేర్​ సందడి.. బెస్ట్ యాక్ట్రెస్​గా అలియా.. ఉత్తమ నటుడు ఎవరంటే? - ఫిల్మ్​ ఫేర్​ అవార్డ్స్​ 2023 ఉత్తమ నటి

ప్రతిష్టాత్మక '68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్' వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్​కు చెందిన సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు. ఇంతకీ ఈ వేడుకల్లో అవార్డులను అందుకున్నావారు ఎవరంటే ?

Filmfare Awards 2023
Filmfare Awards winners

By

Published : Apr 28, 2023, 7:04 AM IST

Updated : Apr 28, 2023, 8:20 AM IST

ముంబయిలో ప్రతిష్టాత్మక '68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్' వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. బీ టౌన్​లో పండుగలా జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ ఏడాది 'గంగూబాయి కాఠియావాడి', 'బాదాయ్‌ దో' చిత్రాలకు అవార్డుల వెల్లువ కొనసాగింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు.. ఇలా 9 విభాగాల్లో 'గంగూబాయి కాఠియావాడి' సినిమా అవార్డులను సొంతం చేసుకుంది.

మరోవైపు ఉత్తమ నటుడుతో పాటు ఆరు కేటగిరీల్లో 'బదాయ్‌ దో' సినిమాను ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. భాషతో సంబంధం లేకుండా యువతను విశేషంగా అలరించిన అయాన్​ ముఖర్జీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1'లోని 'కేసరియా' పాటకు ఉత్తమ సాహిత్య, అలాగే ఉత్తమ గాయకుడి అవార్డులను అందుకుంది. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'కు ఒక్క అవార్డు రాకపోవడం గమనార్హం.

గురువారం సాయంత్రం నుంచే సినీ తారల రాకతో మొదలైన ఈ వేడుక అభిమానులను అలరించింది. ఈ సందర్భంగా పలువురు తారలు స్టేజీపై ఇచ్చిన పర్ఫార్మెన్స్​లు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌ భామలు అదిరిపోయే ట్రెండీ దుస్తుల్లో వేడుకకు హాజరయ్యారు. రెడ్​ కార్పెట్​పై తమ అందాలతో కనువిందు చేశారు. అలియా భట్‌, భూమి పెడ్నేకర్, జాన్వీ కపూర్‌, పూజాహెగ్డే, దియా మీర్జా, ఫాతిమా సనా ఖాన్‌, నర్గీస్‌ ఫక్రీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సన్నీ లియోని వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అవార్డ్స్‌ విజేతలు వీరే..

  • ఉత్తమ చిత్రం: గంగుబాయి కాఠియావాడి
  • ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌): బదాయ్‌ దో (హర్షవర్థన్‌ కుల్‌కర్ణి)
  • ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్‌ రావ్‌ (బదాయ్‌ దో)
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌): సంజయ్‌ మిశ్రా (వధ్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): టబు (భూల్‌ భులయా2), భూమి పెడ్నేకర్‌ (బదాయ్‌ దో)
  • ఉత్తమ సహా నటుడు: అనిల్‌ కపూర్‌ (జుగ్‌జుగ్‌ జీయో)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ సహాయ నటి: షీబీ చద్దా (బదాయ్‌ దో)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ నేపథ్యగాయని: కవిత సేథ్‌ (రంగిసరి- జగ్‌జగ్‌ జీయో)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: బిస్వదీప్‌ దీపక్‌ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ సంభాషణలు: ప్రకాశ్‌ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి, హర్షవర్థన్‌ కుల్‌కర్ణి( బదాయ్‌ దో)
  • ఉత్తమ కథ: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి(బదాయ్‌ దో)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ యాక్షన్‌: పర్వేజ్‌ షేక్‌ (విక్రమ్‌ వేద)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్ ‌(గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ కాస్ట్యూమ్స్‌: సీతల్‌ ఇక్బాల్‌ శర్మ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్‌ సింగ్‌సంధు, రాజీవ్‌ బర్నవాల్‌ (వధ్‌)
  • ఉత్తమ ఎడిటింగ్‌: నినద్‌ ఖనోల్కర్‌ (ఏన్‌ యాక్షన్‌ హీరో)
  • ఉత్తమ కొరియోగ్రఫీ: కృతి మహేశ్‌ (డోలిడా-గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: డెంజ్‌, రెడీఫైన్‌ (బ్రహ్మాస్త్ర పార్ట్‌-1: శివ)
  • ఉత్తమ తొలి చిత్ర నటుడు: అంకుష్‌ గీదమ్‌ (ఝండ్‌)
  • జీవిత సాఫల్య పురస్కారం: ప్రేమ్‌ చోప్రా
  • ఆర్డీ బర్మన్‌ అవార్డు: జన్వీ శ్రీమంకర్‌ (డోలిడా:గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ తొలి చిత్ర నటి: ఆండ్రియా కెవిచూసా (అనేక్‌)
Last Updated : Apr 28, 2023, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details