తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

80లో తారల రీయూనియన్.. సందడి చేసిన నటీనటులు.. ఫొటోలు వైరల్ - 1980s reunion mumbai 2022

80వ దశకంలో వెండితెరపై మెరిసిన తారలంతా ఒకేచోట సందడి చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట రీయూనియన్​ నిర్వహించి.. తమ మధురానుభూతులను గుర్తు చేసుకుంటారు తారలు. ఈసారి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ముంబయిలో జరుపుకొన్నారు. బాలీవుడ్ నటులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్​, సుహాసిని, సుమలత తదితరులు పాల్గొన్నారు.

1980s reunion mumbai 2022
1980s reunion mumbai 2022

By

Published : Nov 13, 2022, 11:35 AM IST

1980ల నాటి సినీ తారలు ప్రతి ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారు. క్రితం సారి 2019లో జరిగిన పదో ఆత్మీయ సమ్మేళనానికి మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఆ కార్యక్రమంలో 80వ దశకానికి చెందిన దాదాపు 40 మంది నటులు, నటీమణులు కలిసి సందడి చేశారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఈ వేడుక జరగలేదు. మూడేళ్ల విరామం తర్వాత వీరింతా మళ్లీ కలిశారు. ఈసారి 11 రీయూనియన్​ను పూనమ్​ దిల్లాన్, జాకీ​ ష్రాఫ్​ కలిసి ముంబయిలో ఘనంగా నిర్వహించారు.

1980ల నాటి సినీ తారల రీయూనియన్

మహారాష్ట్రకు చెందిన తీరొక్క వంటకాలతో విందు అదరగొట్టారని సమాచారం. అనంతరం క్విజ్​లు, రకరకాల గేమ్​లతో తారలు ఆడిపాడారు. సాయంత్రం మొదలైన వేడుకలు తెల్లవారుజాము వరకు సాగినట్టు తెలుస్తోంది. ఈ దక్షిణ తారల అత్మీయ సమ్మేళనానికి కొంత మంది ప్రముఖ బాలీవుడ్ తారలను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. ​ముంబయిలో జరిగిన తారల ఆత్మీయ కలయికలో చిరంజీవి, వెంకటేశ్, నరేశ్​, రాజ్​కుమార్, శరత్​కుమార్, భాగ్యరాజ్, అర్జున్, జాకీ ష్రాఫ్, అనిల్​ కపూర్, సన్నీ డియోల్, సంజయ్​ దత్, భాను చందర్, సుహాసిని, ఖుష్భూ, రమ్య కృష్ణన్​, లిస్సీ, పూర్ణిమ, రాధ, అంబిక, సరిత, సుమలత, శోభన, రేవతి, మేనక, పూనమ్​ దిల్లాన్, నదియా, పద్మిని కే, విద్యాబాలన్, టీనా అంబాని, మీనాక్షి శేషాద్రి, మధూ తదితరులు పాల్గొన్నారు. అయితే, రీయూనియన్‌లో పాల్గొన్న సినీతారలంతా కలిసి తీసుకున్న ఫొటోలు తాజాగా బయటికొచ్చాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1980ల నాటి సినీ తారల రీయూనియన్
1980ల నాటి సినీ తారల రీయూనియన్

ABOUT THE AUTHOR

...view details