ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా విన్ డీజిల్ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఇప్పుడీ సిరీస్‌లో భాగంగా పదో పార్ట్‌గా రానున్న 'ఫాస్ట్ ఎక్స్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో కొన్ని ఎఫ్ అండ్ ఎఫ్ సినిమాలకు దర్శకత్వం వహించిన జస్టిన్ లిన్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్ని చిత్రాల్లోలానే ఈ మూవీలో కూడా కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవి సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచాయి. ఈ సిరీస్‌కు సంబంధించి తర్వాతి వచ్చే చిత్రమే ఆఖరిదని తెలుస్తోంది. ఈ ఫాస్ట్ ఎక్స్ మే 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఇకపోతే ఈ సినిమాలో మరో విలన్‌గా ఆక్వామ్యాన్ ఫేమ్ జేసన్ మోమోవా కనిపించనున్నాడు. అలాగే కెప్టెన్ మార్వెల్ ఫేమ్ బ్రీ లార్సెన్ కూడా ఈ సినిమాలో నటించింది. అయితే ఏడో భాగం షూటింగ్ తర్వాత యాక్సిడెంట్లో చనిపోయిన స్టార్ యాక్టర్ పాల్ వాకర్‌ను కూడా ఈ మూవీలో చూపించనున్నడం విశేషం.