'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. తమ అభిమాన నటులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను చూడటం కోసం ఈవెంట్‌లో పాల్గొన్న ఓ అభిమాని మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అభిమాని మృతి పట్ల సంతాపం ప్రకటించింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది.
'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం.. ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి - బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం
'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను చూడటం కోసం ఈవెంట్‌లో పాల్గొన్న ఓ అభిమాని మృతి చెందాడు.
"బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటుచేసుకుందని తెలిసి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన సాయిరామ్ ఎంతోకాలం నుంచి మాకు వీరాభిమాని. నిన్న రాత్రి జరిగిన ఈవెంట్‌లోనూ పాల్గొన్నాడు. అనారోగ్య కారణాలతో అతడు మృతి చెందాడని తెలిసింది. అతని కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి మేము అన్ని విధాలుగా సాయం అందిస్తాం" అని ఎన్టీఆర్ ఆర్ట్స్, బింబిసార టీమ్ పేర్కొంది. కాగా, కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'బింబిసార'. వశిష్ఠ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. కేథరిన్, సంయుక్తా మేనన్ కథానాయికలు. ఆగస్టు 5న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలం కాదు.. అది నేను నమ్మను: ఎన్టీఆర్