తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ దర్శకుడికి కరోనా.. ఆస్పత్రిలో చేరిక - Manirathanam corona news

స్టార్​ డైరెక్టర్​ మణిరత్నంకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

Manirathanam
మణిరత్నం

By

Published : Jul 19, 2022, 11:44 AM IST

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ సెప్టెంబరు 30న విడుదల కానుంది. గత వారం ఈ చిత్రం టీజర్‌ లాంఛ్‌ కార్యక్రమంలో మణిరత్నంతోపాటు చిత్ర బృందం పాల్గొంది.

అయితే.. ఆ సమయంలో ఎవరూ కొవిడ్‌ నియమాలను పాటించలేదు. కొన్ని నెలల క్రితం పొన్నియన్‌ సెల్వన్‌-1లో కీలక పాత్ర పోషించిన శరత్‌ కుమార్‌ కరోనాకు గురై వెంటనే కోలుకున్నారు. ఈ చిత్ర కథానాయకుడు విక్రమ్‌ కూడా ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు ‘మణిరత్నం’ కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:లెజెండరీ ​సింగర్​ కన్నుమూత.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details