తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కేన్స్ వేదికపై భారతీయ సినిమా వెలుగులు - r madhavan new movie

'కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌' 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ.. భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. సత్యజిత్ రే తెరకెక్కించిన 'ప్రతిధ్వని' సహా మరో ఐదు సినిమాలను కేన్స్ వేదికపై ప్రదర్శించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Cannes
కేన్స్

By

Published : May 4, 2022, 10:45 PM IST

Updated : May 4, 2022, 10:57 PM IST

అంతర్జాతీయ సినీ వేదిక 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌' వజ్రోత్సవంలో భారత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే.. భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించగా.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. భారత దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన 'ప్రతిధ్వని' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా.. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌' ప్రీమియర్​ షోను కేన్స్​ వేదికపై ఈ నెల 19న ప్రదర్శించబోతున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'లో మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో పాన్‌ఇండియా చిత్రంగా రూపొందింది. జులై 1న ఈ సినిమా విడుదల కానుంది. సిమ్రన్‌ కథానాయిక. సామ్‌ సీఎస్‌ స్వరాలందిస్తున్నారు.

సినిమా పరంగా చూసుకుంటే.. అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఈ క్రమంలో భారత్​ నుంచి 'ప్రతిధ్వని', 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'తో పాటు మరో నాలుగు సినిమాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు నిర్వహించనున్న మార్చే డు ఫిల్మ్‌లో కూడా అధికారిక గుర్తింపు లభించినట్లు అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు.

ఇదీ చదవండి: పవన్​కల్యాణ్​ ఫ్యాన్​ కావడం వల్లే ఆదికి సినిమా అవకాశాలు తగ్గాయా?

Last Updated : May 4, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details