తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డంకీ వర్సెస్​ సలార్ - అడ్వాన్స్ బుకింగ్స్​లో ఏ చిత్రం ముందంజలో ఉందంటే ? - డంకీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్

Dunki vs Salaar: మరి కొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు రెండు భారీ ప్రాజెక్ట్​ సినిమాలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్​లో ఇప్పటికే 'సలార్','డంకీ' సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఈ బుకింగ్స్​లో ఏ సినిమా టాప్ పొజిషన్​లో ఉందంటే ?

Dunki vs Salaar
Dunki vs Salaar

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 4:37 PM IST

Dunki vs Salaar : వింటర్ సీజన్ మొదలైన వేళ సినీ ప్రేక్షకులకు పండుగ సీజన్​ కూడా వచ్చేసింది. ఇప్పటికే 'యానిమల్​' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్​ చేస్తూ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ నెలలో విడుదల కానున్న రెండు భారీ సినిమాలపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అటు 'సలార్'​తో పాటు ఇటు 'డంకీ' కూడా ఒకేసారి థియేటర్లలోకి రానున్న తరుణంలో ఇరు స్టార్ల అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.

ఇక మూవీ రిలీజ్​ డేట్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్​ అడ్వాన్స్ బుక్కింగ్స్​ను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత్​లో ఈ వీకెండ్స్​లో టికెట్లు విక్రయమవ్వనున్నాయని సమాచారం. అయితే ఓవర్సీస్​లో మాత్రం కొద్ది రోజుల క్రితమే బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో అభిమానులు కూడా భారీ సంఖ్యలోనే ఈ రెండు సినిమాల టికెట్లను కొనుగోలు చేశారు. యూఎస్​లో 'సలార్' డిసెంబర్ 21న విడులవ్వనుంది. దీంతో ఇప్పటి వరకు 347 లొకేషన్స్​లో దాదాపు 1119 షోలు రన్​ అవ్వనున్నాయని సమాచారం. అయితే సుమారు 22,000 టిక్కెట్ల విక్రయాల ద్వారా 'సలార్'కు ఇప్పటి వరకు 593,657 డాలర్లు (దాదాపు రూ. 4.94 కోట్లు) వసూలయ్యాయట. దీంతో యూఎస్​లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థమైపోయింది.

Dunki Advance Bookings : మరోపైపు 'డంకీ'కి కూడా రికార్డు స్థాయిలో అడ్వాన్స్​ బుకింగ్స్ అయినట్లు సమాచారం. సుమారు 328 లొకేషన్స్​లోని 925 షోలకు దాదాపు 6514 టిక్కెట్లు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. దీని ద్వారా సుమారు 90,292 డాలర్లు అంటే దాదాపు రూ. 75 లక్షలు) వసూలయ్యాయని సమాచారం. అయితే ఈ రెండు చిత్రాలకు సమానమైన స్క్రీన్స్ లభించినప్పటికీ 'వాన్కా', 'ఆక్వామాన్' 'ది లాస్ట్ కింగ్‌డమ్' లాంటి ల బ్లాక్‌బస్టర్‌లతో పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండింట్లే ఏ చిత్రం అభిమానులను ఆకట్టుకుని బాక్సాఫీస్ ముందు బ్లాక్​ బస్టర్​గా నిలుస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్​ చేయాల్సిందే.

రిలీజ్​కు ఇంకా పదిరోజులే- సలార్ ప్రమోషన్లు ఎక్కడ బాసూ?

నెటిజన్​కు షారుక్​ ఖాన్​ దిమ్మతిరిగే కౌంటర్​- మందులు పంపిస్తా తగ్గుతుందంటూ!

ABOUT THE AUTHOR

...view details