Dulquer salman Sitaramam teaser: తనకు వచ్చిన ఉత్తరాలను చూసి 'సీతా.. ఎవరు నువ్వు?' అంటూ ప్రేమలో పడిపోయారు హీరో దుల్కర్ సల్మాన్. ఎప్పటికప్పుడు తన నటనతో ప్రత్యేకతను చాటుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారాయన. ఈ యంగ్ హీరోకు తెలుగులో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ హీరో నటించిన కొత్త సినిమా 'సీతారామం'. స్వప్న సినిమా పతాకంపై వస్తోన్న ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని శనివారం గ్రాండ్‌గా నిర్వహించి ప్రచారచిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులోనే దుల్కర్.. 'సీతా.. ఎవరు నువ్వు?' అంటూ ప్రేమలో పడిపోయారు. "ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం.. లెఫ్టినెంట్ రామ్ నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది" అంటూ ప్రారంభమైన ఈ చిత్ర టీజర్ ఆద్యంతం హృద్యంగా సాగింది. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచుతూ సినీప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతకుముందు ఈ సినిమా నుంచి విడుదలైన 'హో సీతా వదలనిక తోడవుతా..' శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఈ ఫీల్ గుడ్ సాంగ్‌ను ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ రాయగా.. ఎస్.పి చరణ్, రమ్య బెహరా అలపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో రష్మిక కీలకపాత్ర పోషిస్తుండగా..దుల్కర్ సరసన మృణాళిని ఠాకూర్ నటిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రేమకథా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న హను రాఘవపూడి.. 1965 నాటి కాలంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కనిపించనున్నారు. ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళం, మలయళ భాషల్లో ఒకేసారి అలరించనున్న ఈ సినిమాకు పి.ఎస్.వినోద్ ఛాయగ్రహణ బాధ్యతలు చేపట్టారు.
ఆకట్టుకుంటున్న దుల్కర్ 'సీతారామం' టీజర్.. బన్నీతో మూవీకి హరీశ్ ప్లాన్!
కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'సీతారామం' సినిమా టీజర్ విడుదలై ఆక్టటుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు దర్శకుడు హరీశ్‌శంకర్.. హీరో అల్లుఅర్జున్‌తో ఓ సినిమా చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Harishshankar Alluarjun movie: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతలా హిట్ అవుతుయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో 'భవదీయుడు భగత్‌సింగ్' అనే చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం.. సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్‌కు ఉన్న బిజీ షెడ్యూలే కారణం. అయితే ఈ గ్యాప్‌లో ఆయన అల్లుఅర్జున్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బన్నీ నటించనున్న 'పుష్ప 2' షూటింగ్ సెట్స్‌పై వెళ్లడానికి మరింత ఆలస్యం పట్టొచ్చని, ఈ విరామంలో ఆయన ఓ మూవీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. మరి ఈ గ్యాప్‌లో హరీశ్ శంకర్-అల్లుఅర్జున్ సినిమా రూపొందుతుందేమో చూడాలి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'డీజే' సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి: షారుక్ @30ఇయర్స్.. ఇంటెన్సివ్ లుక్‌లో బాద్షా.. స్టైల్ అదిరింది..