Disha Patani Career Story:చాలా మంది నటులు డాక్టర్ కాబోయి, యాక్టర్ అయ్యాను అని అంటుంటారు. కానీ దిశా పటాని మాత్రం పైలట్ అవ్వాలనుకుని నటిగా స్థిరపడింది. ఆమె ఒక డీఎస్పీ కూతురు, పైగా మధ్యలోనే చదువు కూడా వదిలేసింది. మరి ఆమె కెరీర్ స్టోరీ ఏంటంటే?
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో దిశా పటాని ఒకరు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 58.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామరస్ ఫొటో షూట్స్ అన్నా మెస్మరైజింగ్ డ్రెస్సుల గురించి మాట్లాడినా అందులో ఆమె ప్రస్తావన తప్పక ఉంటుంది. బాగీ - 2, MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, మలంగ్ లాంటి హిట్ సినిమాల్లో నటించి ఇప్పటికే తనేంటో నిరూపించుకుని బాలీవుడ్లో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అయితే ఆమె సినీ జర్నీ గురించి కొందరికి మాత్రమే తెలుసు.
1992 జూన్ 13న ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో జగదీష్ సింగ్ పటానీ - పద్మా పటానీ దంపతులకు దిశా పటాని జన్మించింది. తండ్రి మాజీ DSP (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్), తల్లి హెల్త్ ఇన్‌స్పెక్టర్. ఒక చదువు విషయానికి వస్తే పాఠశాల విద్య బరేలీలో పూర్తి చేసింది. తర్వాత, లఖ్‌నవూ లోని అమిటీ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ జాయిన్ అయింది.
కానీ, తనకు ఇష్టమైన మోడలింగ్ కోసం సెకండ్ ఇయర్ మధ్యలోనే చదువు ఆపేసింది. అయితే నటి కావాలని మొదట్లో అనుకోలేదు. ఆమె స్కూల్లో ఉన్నప్పుడే ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలని కోరుకుంది. ఆ కలను నెరవేర్చుకోవడానికే అమిటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ లో చేరింది. ఆమె మోడలింగ్‌లోకి ఎలా వచ్చిందనే విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడం ఖాయం.