Pushpa 2 Movie : పుష్ప-అల్లుఅర్జున్-సుకుమార్.. ఈ పేర్లు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతున్నాయి. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. దీంతో రెండో పార్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆ సినిమా దర్శకుడు సుకుమార్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సుకుమార్ 'పుష్ప-2' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా పని చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్ప సినిమా భారీ విజయం సాధించడం వల్ల ఈ స్టార్ డైరెక్టర్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడట. సాధారణంగా రూ.15 కోట్లు తీసుకునే సుక్కు.. ప్రస్తుతం రూ.60 కోట్లకు పెంచేశాడని సినీవర్గాలు అంటున్నాయి. అయితే 'పుష్ప-2' చిత్రానికి మాత్రం ఆయన రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. తను కొత్తగా స్టార్ట్ చేసిన సుకుమార్ రైటింగ్స్.. ఈ సినిమాకు కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాకు సుకుమార్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అయితే ఇదేమీ తక్కువ మొత్తం కాదని విశ్లేషకులు అంటున్నారు. అలా లాభాల్లో షేర్ చూసినా.. సుకుమార్ కనీసం రూ.70 కోట్ల వరకు వెనకేసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే అల్లు అర్జున్ కూడా పార్ట్-2 కోసం రూ.125 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. 'పుష్ప' సూపర్ డూపర్ హిట్ కావడం వల్ల.. 'పుష్ప-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.