తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ దర్శకుడు కన్నుమూత, స్టార్ హీరోల సంతాపం - సావన్​ కుమార్ మృతి

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు సావన్​ కుమార్ టక్​ (86) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Sawan kumar tak died
Sawan kumar tak died

By

Published : Aug 25, 2022, 6:30 PM IST

Sawan kumar tak died: ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు సావన్​ కుమార్​ టక్​ కన్నుమూశారు. 86 ఏళ్ల సావన్​.. ముంబయిలోని కోకిలాబెన్​ ధీరుబాయ్​ అంబానీ ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేర్చామని చెప్పారు. గురువారం సాయంత్రం 4:15 గంటలకు హార్ట్ ఫెయిల్యూర్​తో మరణించారని వెల్లడించారు.

సల్మాన్ ఖాన్​ నటించిన 'సనమ్​ బెవఫా', 'ఛాంద్​ కా తుక్​డా', 'సావన్​.. ది లవ్​ సీజన్'​ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు సావన్. ఆయన మరణంపై ట్విట్టర్​ వేదికగా స్పందించారు సల్మాన్ ఖాన్​. సావన్​ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 1972లో 'గోమ్టి కే కినారే'చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు సావన్​. దర్శకత్వంతో పాటు పలు చిత్రాల్లో పాటలను రాశారు.

ABOUT THE AUTHOR

...view details