తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట విషాదం

Director R.Narayanamurthy mother died: విప్లవ చిత్రాలను తెరకెక్కించి ఉద్యమ శక్తుల్లో స్ఫూర్తినింపిన దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి. మంగళవారం ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వయోభార సమస్యలతో ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

R.Narayanamurthy mother died
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట విషాదం

By

Published : Jul 5, 2022, 11:21 AM IST

Director R.Narayanamurthy mother died: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. మంగళవారం వయోభార సమస్యలతో ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. రౌతులపూడి మండలం మల్లం పేటలోని తన నివాసంలో కన్నుమూశారు. దీంతో నారాయణ మూర్తి కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

ఇక ఆర్‌.నారాయణ మూర్తి విషయానికొస్తే.. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకుడిగా, గాయకుడిగా, డాన్సర్‌గా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్‌ ఉంది. సమాజంలో దిగువ శ్రేణిని ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తారో బహిర్గతం చేసే సమాంతర చిత్రాలను తెరకెక్కించి వాటి ద్వారా ఈయన ప్రసిద్ధి చెందారు. ఆయన చిత్రాల పేర్లు కూడా విప్లవ సంకేతాలు. 'అర్ధరాత్రి స్వతంత్య్రం', అడవి దివిటీలు, లాల్‌ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, వేగు చుక్కలు లాంటి సినిమాలే అందుకు ఉదాహరణలు.

ఇదీ చూడండి: కల్యాణ్​రామ్​ 'బింబిసార'లో ఎన్టీఆర్​!

ABOUT THE AUTHOR

...view details