'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ ఒక్క సినిమా ఆయన రేంజ్‌ను అమాంతం పెంచేసింది. అయితే ఆయన జనం ముందు ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడాలంటే చాలా మొహమాటం పడుతుంటారు. ఆయన్ను సిగ్గరి అంటుంటారు. అందుకే ఆయన ఎక్కువగా ఎవరి ఫంక్షన్స్‌కు రారు. తన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లోనూ ఆయన ఎక్కువసేపు మాట్లాడరు. చాలా తక్కువగా మాట్లాడి ముగించేస్తుంటారు. అలాగే సెట్‌లోనూ కూడా ఎక్కువమంది ఆర్టిస్ట్‌లు, మిగతా వారు ఉంటే.. గట్టిగా డైలాగ్‌లు కూడా చెప్పడానికి తెగ ఇబ్బంది పడిపోతారట. అవును మీరు చదివేది నిజమే.. అయితే ఈ ఇబ్బంది వల్ల ఓ సారి దర్శకధీరుడు రాజమౌళి తిట్లు తినాల్సి వచ్చిందట.
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్‌లో 'ఛత్రపతి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. సినిమా ఇంటర్వెల్ చిత్రీకరణ సమయంలో విలన్‌ను చంపిన తర్వాత.. కోట శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చిన సమయంలో జనాన్ని ఉద్దేశిస్తూ ప్రభాస్ డైలాగ్ చెప్పాలి. ఓవైపు వర్షం, మరోవైపు చలితో ఇబ్బంది పడుతున్న ఆయన.. అంత మంది జనం కనిపించే సరికి డైలాగ్ చెప్పలేకపోయారట. అక్కడే ఉన్న డైరెక్టర్ రాజమౌళిని పిలిచి 'నేను డైలాగ్ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతా. ప్లీజ్..' అని అన్నారట.