Hanuman Movie Prasanth Varma : టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. 'అ!' సినిమాతో దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత 'అ', 'కల్కి', 'జాంబిరెడ్డి' లాంటి ప్రయోగాత్మక, వైవిద్యభరితమైన సినిమాలతో మెప్పించారు. సరికొత్త కాన్సెప్ట్స్లతో, విజువల్స్‌తో వండర్స్ చేస్తూ.. ఓ స్పషల్ ఇమేజ్ను తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన 'హను-మాన్'తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అలానే తర్వలో 8 సూపర్ హీరో సినిమాలను రూపొందిస్తానని చెప్పారు. తాజాగా హనుమాన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయాలను చెప్పారు.
"నా గత చిత్రాల తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు సూపర్ హీరో సినిమా చేయాలనిపించింది. నాకు సూపర్ హీరోలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ చూసి అలా అవ్వాలని ట్రై చేశాను. సాలె పురుగు పట్టుకొని కూడా తిరిగాను. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో సూపర్ హీరో అనేది కమర్షియల్ జానర్. తెలుగులో ఇలాంటి ఎందుకు ప్రయత్నం చేయకూడదని అనుకుని 'హను మాన్' చేశాను. ప్రతి సూపర్ హీరో సినిమాకు ఓ బలమైన ఆరిజన్ ఫిల్మ్ ఉంటుంది. ఫస్ట్ మూవీలో సూపర్ హీరోగా మారిన పాత్ర ఆడియెన్స్‌లో బలమైన ప్రభావం చూపుతుంది. చెడుపై పోరాడి దాన్ని అంతం చేసిన తర్వాత ఆ పాత్ర ఏం చేస్తుందనే ఆసక్తి కూడా ఉంటుంది. ఇందులో కూడా హనుమంతుగా తేజ పాత్ర అంతే ప్రభావవంతంగా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక అతడు ఏం చేస్తాడనేది ఆసక్తి రేకెత్తిస్తుంది. అందుకే దీన్ని ఓ యూనివర్స్‌లా కంటిన్యూ చేయాలనుకుంటున్నా. నా నెక్ట్స్ సూపర్ హీరో మూవీ 'అధీర'కు కనెక్షన్ ఉంటుంది" అని ప్రశాంత్ వర్మ అన్నారు. అలాగే తాను భవిష్యత్తులో 8 సూపర్ హీరోలతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వర్మ చెప్పినట్లు కథనాలు కూడా వస్తున్నాయి. దాని కోసం ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నట్లు, హాలీవుడ్ స్టైల్‌లో అవి ఉంటాయని అంటున్నారు.
బాలకృష్ణతో సినిమా..