తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Acharya: కాజల్​ పాత్రపై దర్శకుడు కొరటాల క్లారిటీ - chiranjeevi kajal agarwal acharya

Acharya movie Kajal role: 'ఆచార్య' సినిమాలోని హీరోయిన్ కాజల్​ అగర్వాల్​ పాత్రను తొలిగించారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు దర్శకుడు కొరటాల శివ. ఏమన్నారంటే..

Acharya movie Kajal role:
కాజల్​ పాత్రపై దర్శకుడు కొరటాల క్లారిటీ

By

Published : Apr 25, 2022, 10:15 AM IST

Acharya movie Kajal role: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్​ అగర్వాల్​, పూజాహెగ్డే హీరోయిన్లు. అయితే ఈ చిత్రంలో కాజల్​ సన్నివేశాలని కత్తిరించారా అనే అనుమానం అభిమానుల మదిలో కొద్ది రోజులుగా మెదులుతోంది. ఆమె పాత్ర కూడా పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చని అంతా మాట్లాడుకున్నారు. ఇటీవలే విడదలైన టీజర్​, ట్రైలర్​లలో పూజాహెగ్డేను చూపించినప్పటికీ.. కాజల్​ను అస్సలు చూపించకపోవడమే దీనికి కారణం. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమె పేరు వినిపించడం లేదు.

అయితే తాజాగా.. 'ఆచార్య' ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కొరటాల శివ కాజల్​ పాత్ర గురించి స్పష్టతనిచ్చారు. "మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుంటుందనిపించింది. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ చేశాం. పాత్ర రాసుకున్నాం, షూట్‌ చేశాం కానీ, 'ఆచార్య' పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు సందేహం కలిగింది. అదే సమయంలో కరోనా రావడంతో కొన్నిరోజులపాటు ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదని, సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్‌తో చేయిస్తే బాగోదనిపించింది. అలాగే ఆ పాత్రకు పాటలు కూడా లేవు, సరైన ముగింపు కూడా లేదు.. ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పాను. 'కథకు ఏది అవసరమో అదే చెయ్‌. నీకున్న సందేహాన్ని అందరితో పంచుకో' అని చిరు చెప్పారు. అదే విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకుని.. 'నేను మీ అందర్నీ మిస్‌ అవుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దాం' అని చెప్పారు. అలా, ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించాం’’ కొరటాల శివ వివరించారు. అయితే, 'లాహే లాహే' సాంగ్‌లో కాజల్‌ కనిపిస్తారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని శివ అన్నారు. కాగా, 'ఆచార్య'ను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్​ అవ్వనుంది.

ఇదీ చూడండి: పవన్​కల్యాణ్​తో మల్టీస్టారర్​ సినిమా.. ​చరణ్​ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details