తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2023, 1:25 PM IST

Updated : Jun 23, 2023, 1:46 PM IST

ETV Bharat / entertainment

Boyapati Rapo : ఇంకా పేరు కూడా పెట్టలేదు.. అప్పుడే  రిలీజ్​ డేట్​ ఫిక్స్​!

Boyapati Rapo Release Date : టాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్​ హీరో రామ్ పోతినేని కాంబోలో ​ తెరకెక్కుతున్న 'బోయపాటి రాపో'మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్​ వచ్చేసింది. అదేంటంటే ?

Boyapati Rapo Release Date 15th Sept 2023
బోయపాటి రాపో విడుదల తేదీ 15 సెప్టెంబర్​ 2023

Boyapati Rapo Release Date : ఎనర్జిటిక్​ హీరో రామ్​ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం అందరి అంచనాలను పెంచేస్తోంది. 'బోయపాటి రాపో' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్​ ఇండియా రేంజ్​లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్​ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానుల్లో ఎక్స్​పెక్టేషన్స్​ పెంచేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసిన మూవీ టీమ్​ సినిమా.. ప్రేక్షకుల కోసం రిలీజ్​ డేట్​ను ఖరారు చేసింది. ఓ పల్లెటూరి వాతావరణంలో మంచంపై పంచెకట్టులో కూర్చున్న రామ్​.. ఇక ఆయన చేతిలో ఓ కాఫీ కప్.. ఇలా పచ్చటి పొలాల మధ్య స్టైలిష్​ లుక్​లో రామ్​ కనిపిస్తున్నారు. 'వీ ఆర్​ కమింగ్​ ఇన్​ ఎర్లీ'( మేము ముందుగానే వచ్చేస్తున్నాము) అంటూ ఆ పోస్ట్​ను షేర్​ చేసిన మూవీ టీమ్​ అందులో సెప్టెంబర్​ 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అంటే అప్పట్లో ఈ సినిమాను అక్టోబర్​ 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా కోసం దసరా వరకు వేచి చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త తీయ్యటి కబురులా అనిపించింది. అయితే ఇప్పటికీ ఆ పోస్టర్​లో 'బోయపాటిరాపో' అనే వర్కింగ్​ టైటిల్​ ఉండటం వల్ల ఇంకా ఈ సినిమాకు పేరు ఎందుకు పెట్టలేదంటూ ఫ్యాన్స్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్​ విషయంలో చిత్ర బృందం మాత్రం 'స్కంద' అనే పేరు పెడితే ఎలా ఉంటుందనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల టాక్​.

Boyapati Srinu- Rampothineni : భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో రామ్​ సరసన శ్రీలీ నటిస్తోంది. పక్కా కమర్షియల్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్​ పూర్తి మాస్​ లుక్​లో సందడి చేయనున్నారు. ఎస్​ఎస్​ థమన్ సంగీతం అందిస్తుండగా.. శ్రీనివాస్ సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ్యూసర్​ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, భాషల్లో వరల్డ్​ వైడ్​గా విడుదల చేయనున్నారు.

మరోవైపు సినిమాల విషయంలో హీరో రామ్​ తన స్పీడ్​ను పెంచినట్లుగా కనిపిస్తున్నారు. గతేడాది వచ్చిన 'ది వారియర్​' సినిమాను తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి రిలీజ్​ చేశారు రామ్​. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' వంటి బ్లాక్​ బ‌స్ట‌ర్​ హిట్​ను అందుకున్న తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రం బోయపాటి రాపో. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అడియెన్స్​. మరి శర వేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా అఖండ విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్​ 15 వరకు వెయిట్​ చేయాల్సిందే.

Last Updated : Jun 23, 2023, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details