తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నితిన్​కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ - ఫ్యాన్​ బాయ్ మూమెంట్​ అంటే ఇదేనేమో! - హీరో నితిన్​ లేటెస్ట్​ ట్వీట్​

Dhoni Gift To Nithin : టాలీవుడ్ హీరో నితిన్​ ఓ స్పెషల్​ గిఫ్ట్ అందింది. అది కూడా భారత మాజీ స్టార్​ క్రికెటర్​ తరఫున ఆయన ఈ బహుతమిని అందుకున్నారు. మరి ఆ ఆటగాడు ఎవరు? ఏం గిఫ్ట్​ పంపించాడంటే..

Dhoni Gifts An Autographed Shirt To Nithiin
Dhoni Gift To Nithin

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 4:58 PM IST

Dhoni Gift To Nithin : 'దిల్'​, 'జయం' వంటి ఫ్యామిలీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్​ యంగ్ హీరో నితిన్​. అడపాదడపా సినిమాలు చేస్తూ 2020లో 'భీష్మ' సినిమాతో తెలుగు ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. ఈ మూవీని ప్రేక్షకులు బాగానే రిసీవ్​ చేసుకున్నారు. దీంతో వరుసపెట్టి 2021లో ఏకంగా మూడు సినిమాలను తెరక్కెక్కించారు నితిన్​. ఒకటి 'చెక్'​, రెండోది 'రంగ్​ దే' కాగా.. మరొకటి మ్యాస్ట్రో. అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. ఇక 2022లో 'మాచర్ల నియోజకవర్గం' సినిమా కూడా ఆడియెన్స్​ను నిరాశపరిచింది.

అయితే తాజాగా ఈ స్టార్ హీరో.. ఎక్స్​ట్రాడినరీ మ్యాన్​ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నితిన్ ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే హీరో నితిన్​కు ఓ స్పెషల్​ గిఫ్ట్​ పంపించారు భారత క్రికెట్​ మాజీ సారథి ఎం.ఎస్ ధోనీ. 'బెస్ట్​ విషెస్​ నితిన్​' అని తన ఆటోగ్రాఫ్​తో ఉన్న టీ-షర్ట్​ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని నితిన్​ తన సోషల్ మీడియా అకౌంట్​ ద్వారా షేర్ చేశారు. 'ఎక్స్​ట్రాఆర్డినరీ వ్యక్తి నుంచి ఎక్స్​ట్రాఆర్డినరీ గిఫ్ట్​' అంటూ దానికి క్యాప్షన్​ను జోడించారు. ఇక 'థ్యాంక్యూ ఎం.ఎస్​ ధోనీ సర్​ ఫర్​ దిస్.. లవ్​ యూ' అంటూ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

Extraordinary Man Movie Cast : ఇక ఎక్స్​ట్రాడనరీ సినిమా విషయానికి వస్తే.. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నితిన్​కు జంటగా 'పెళ్లి సందడి' ఫేమ్​, యంగ్​ బ్యూటీ శ్రీలీల నటించారు. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. హ్యారిస్ జయరాజ్ ఈ మూవీకి​ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్​కు అభిమానులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్​ లభిస్తోంది. కాగా, ఈ సినిమా డిసెంబర్​ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఎప్పుడూ ఇదే మాట చెబుతాను..'
Nithin About Pawan Kalyan :మరో వారం రోజుల్లో 'ఎక్స్​ట్రాఆర్డినరీ మ్యాన్​' విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్​లో బిజీగా గడుపుతున్నారు హీరో నితిన్​. ఈ సందర్భంగా ఓ ఈవెంట్​కు వెళ్లిన ఆయన పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని ఎక్కువగా చూపిస్తున్నానంటూ కొందరు నెటిజెన్స్​ కామెంట్స్‌ చేస్తున్నారని నితిన్ తెలిపారు. కానీ, తనకంటే ఎక్కువ మంది హీరోలు వారి చిత్రాల్లో పవన్​ కల్యాణ్​ ఇమేజ్​ను వాడుకుంటున్నారని అన్నారు. 'ఎక్స్​ట్రాఆర్డినరీ మ్యాన్'లో ఒక సన్నివేశంలో భాగంగా పవన్ కల్యాణ్​​లా డ్రెస్‌ వేసుకుని యాక్ట్​ చేయాల్సి వచ్చింది. అంతేగానీ ఫొటోషూట్‌ కోసం నేను అలా రెడీ అవ్వలేదు. నేను ఒక హీరోనైనా వపన్​కల్యాణ్​కు మాత్రం ఎప్పటికీ అభిమానినే. నేను ఎప్పుడూ ఇదే మాట చెబుతాను' అని నితిన్​ వివరణ ఇచ్చారు.

సల్మాన్​ ఖాన్​కు బెదిరింపులు! - చావుకు వీసా అక్కర్లేదంటూ వార్నింగ్!

పవన్​ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డైలాగ్​ లీక్​- 'యానిమల్' విలన్ అంత పని చేశాడా!

ABOUT THE AUTHOR

...view details