విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ స్టార్ హీరో ధనుశ్. తన నేచరల్ యాక్టింగ్‌తో హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. అయితే ఇప్పుడాయన నుంచి హీరోగా వచ్చిన మరో తాజా చిత్రం 'సార్'. తెలుగులో ఇది ఆయనకు స్టైట్ సినిమా. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందని తెలిసింది.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణలో కలిపి రూ.5.5 కోట్ల వ్యాల్యూ బిజినెస్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 6 కోట్ల షేర్ అందుకోవాలి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఏపీ కలిపి.. నైజాంలో రూ. 3.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.23 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 1.15 కోట్లు, తూర్పు గోదావరి రూ. 88 లక్షలు, పశ్చిమ గోదావరి రూ. 33 లక్షలు, గుంటూరు రూ. 74 లక్షలు, కృష్ణ రూ. 62 లక్షలు, నెల్లూరు రూ. 35 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 8.85 కోట్ల షేర్, రూ. 16.39 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. అంటే ఈ సినిమా దాదాపు రూ.3.05 కోట్లు లాభం అందుకుందన్న మాట.
ఇక సార్ సినిమాకు పోటీగా.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఫిబ్రవరి 18న విడుదలై ఈ సినిమా కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. తెలుగులో రెండో రోజు నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, తూర్పు గోదావరిలో రూ. 9 లక్షలు, పశ్చిన గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి మొత్తంగా రెండో రోజు రూ. 1.21 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అలా రెండు రోజుల్లో రూ. 2.56 కోట్లు షేర్, రూ. 4.65 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.
కాగా, నైబర్ నెంబర్ అనే డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 4 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లు. అయితే ఈ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దీనికి రూ. 2.81 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.69 కోట్లు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్‌ను అందుకుంటోంది.
ఇదీ చూడండి:వెయ్యి కోట్ల "పఠాన్".. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బంపర్ ఆఫర్.. "బాద్షా" సరికొత్త చరిత్ర!