Devara Update:జూ. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' నుంచి న్యూఇయర్ సందర్భంగా కీలక అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. జనవరి 8న సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, జనవరి 8న దేవర గ్లింప్స్ రానున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
దేవరలో కల్యాణ్ రామ్:దేవర సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్‌తో స్క్రీన్ షర్ చేసుకున్నారని పలు వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. ఆయన ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్ గూస్బంప్స్ తెప్పిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. మరి నిజంగానే కల్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించారా? లేదా అని తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మూవీయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
అంచనాలు మించి:అయితే డెవిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కల్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఓ సందర్భంలో దేవర గురించి ప్రస్తావన రాగా, ఫ్యాన్స్ అంచనాలు మించేలా ఈ సినిమా రూపొందుతుందని కల్యాణ్ రామ్ అన్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందన్న ఆయన, అప్డేట్ గురించి ఫ్యాన్స్ అడుగుతుంటే ఒత్తిడి కలుగుతుందన్నారు. కాగా, దేవర సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.