DEEPIKA PADUKONE TWIN: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటుంటాం. 'టిక్‌టాక్' ద్వారా సినీ తారలను పోలిన కొందరు వ్యక్తులను చూశాం. మహేశ్‌బాబు, ప్రభాస్, ధనుష్.. ఇలా పలువురు నటులను తలపించేలా ఆహార్యం ఉన్న వారు ఎంతోమందిని ఆకట్టుకున్నారు. పాపులారిటీని సంపాదించారు. ఇప్పుడా జాబితాలోకి చేరింది రిజుతా ఘోష్. మాధ్యమం అదికాకపోయినా అదే స్థాయిలో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. కోల్‌కతాకు చెందిన ఈమె అచ్చం.. బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
'అరె.. అచ్చం దీపికలా ఉందే..! ఆమె చెల్లెలేనా?' - దీపికా పదుకొణె రిజుతా
DEEPIKA PADUKONE TWIN: అచ్చం బాలీవుడ్ నటి దీపికా పదుకొణెలా కనిపిస్తున్న ఓ యువతి సోషల్‌మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. దీపికను తలపించేలా ఉన్న ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి.
రిజుతా.. డిజిటల్ క్రియేటర్. 2015లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆమె కొన్నాళ్లు ఎక్కువగా వృత్తిపరమైన విశేషాలను పంచుకునేవారు. క్రమంగా తన స్టిల్స్‌ను షేర్ చేయడం ప్రారంభించారు. వాటిల్లో కొన్ని దీపికను తలపించేలా ఉండటంతో ఆమె ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టేవి. అలా 'ఈమె ఎవరో తెలుసుకుందాం' అంటూ ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూసిన నెటిజన్లు థ్రిల్ అవుతున్నారు. 'వావ్ మీరు దీపికలా ఉన్నారు', 'హో.. మిమ్మల్ని చూసి దీపికా పదుకొణె అనుకున్నా', 'మీరు దీపికా సిస్టరా', 'దీపికా 2. o' అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. రిజుతాను ఇన్‌స్టాలో అనుసరిస్తున్న వారి సంఖ్య సుమారు 49వేలు.
ఇదీ చదవండి: