తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

స్టేజ్​పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన కమెడియన్​ ధనరాజ్​ - కమెడియన్​ ధనరాజ్​ కన్నీరు

ఓ వైపు సినిమాలు చేస్తూనే, జబర్దస్త్​ ద్వారా ఫుల్​ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్​ ధనరాజ్.. ఓ ఈవెంట్​లో స్టేజ్​పైనే వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఏం జరిగిందంటే.

Dhanraj emotional
ధనరాజ్​ ఎమోషనల్​

By

Published : Aug 31, 2022, 1:27 PM IST

Updated : Aug 31, 2022, 1:40 PM IST

comedian dhanraj Emotional తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్​ ధనరాజ్. ఓ వైపు సినిమాలతో, మరోవైపు జబర్దస్త్​తో ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకున్నారు. అయితే ఆయన కూడా మిగతా హాస్యనటులలానే హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం బుజ్జీ ఇలా రా. తాజాజా ఈ మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన చాలా ఎమోషనల్​ అయ్యారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల.. ధనరాజ్​ గురించి మాట్లాడుతూ.. "నాకు ఇండస్ట్రీకి వచ్చాక పరిచయం అయిన మెుదటి ఫ్రెండ్ వీడు.. అలాగే అరేయ్, బావ అని పిలుచుకునే బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇలా ఈ రోజు వాడి సినిమాకు వచ్చి ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ధన్ రాజ్ హీరో అనడం కంటే మంచి యాక్టర్ అనడంమే నాకు ఇష్టం. వాడు మరిన్ని సినిమాలు హీరోగా చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీలో మేం చాలా కష్ట పడ్డాం" అని చెప్పారు. ఆ మాటలు వినిన ధన్ రాజ్ స్టేజ్ మీదకు ఏడుస్తూ వచ్చి.. "సారీ క్షమించాలి.. ఇంత సేపూ నవ్వుతూనే ఉన్నా.. కానీ వీడి మాటలు విని ఎందుకో ఇలా ఏడుపు వచ్చింది" అంటూ భావోద్వేగంతో మాట్లాడారు.

కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. క్రైమ్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్​గా చాందిని తమిళసరన్ నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్యకృష్ణ, వేణు, భూపాల్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్కీన్‌ ప్లే అందిస్తున్నారు. జి. నాగేశ్వర రెడ్డి టీమ్‌ వర్క్స్‌, ఎస్‌.ఎన్‌.ఎస్‌. క్రియేషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: అంజి, మాటలు: భాను, నాయుడు, కూర్పు: చోటా కె. ప్రసాద్‌, కళ: చిన్నా.

ఇదీ చూడండి: రాకింగ్​ రాకేశ్​-సుజాత పెళ్లి ఫిక్స్​, ఎప్పుడంటే

Last Updated : Aug 31, 2022, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details