Comedian Dhanraj Direction :తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు ధన్‌రాజ్. బుల్లితెర కామెడి ప్రోగ్రామ్ జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన సహ నటుడు, సీనియర్ కమెడియన్ వేణు యెల్దండి బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటుడు ధన్‌రాజ్ డైరెక్టర్‌గా మారబోతున్నారు.
కమెడియన్ ధన్‌రాజ్.. తండ్రి కుమారుల సెంటిమెంట్‌తో ఎమోషనల్‌గా ఉండే కథను సిద్ధం చేసుకున్నారట. బలగం సినిమాలా, పక్కా ఎంటర్టైన్మెంట్తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ.. రెండింటిని బ్యాలెన్స్ చేసే స్క్రిప్ట్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇదే నెలలో ప్రారంభం కానుంది. తక్కువ షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి.. సినిమాను త్వరగా రిలీజ్ చేయాలని ధన్‌రాజ్ భావిస్తున్నారట. సాంకేతిక నిపుణులు, నిర్మాత, నటీనటులు తదితర వివరాలు రెండు లేదా మూడు రోజుల్లో తెలియనున్నాయి. మరి కమెడియన్‌గా సూపర్ హిట్టైన ధన్‌రాజ్.. దర్శకుడిగా ఎంతవరకు రాణిస్తారో చూడాలి. అయితే ధన్రజ్ డైరెక్టర్‌గా మారేకన్నా ముందు ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నష్టపోయారు!
ఇకపోతే ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్తేమి కాదు. ఇలాంటి సందర్భాలు మన టాలీవుడ్లోనే ఉన్నాయి. అయితే హాస్య నటులు డైరెక్టర్లుగా మారడం మాత్రం అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలా మారిన వారు సక్సెస్ అయిన సందర్భాలూ చాలా తక్కువే. మోస్ట్ సీనియర్ కమెడీయన్లు ఏవీఎస్ తీసిన 'సూపర్ హీరోస్', ఎంఎస్ నారాయణ డైరెక్ట్ చేసిన 'కొడుకు', ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో వచ్చిన 'రెండు తోకల పిట్ట' ఇలా ఎందరో స్టార్ కమెడియన్లు డైరెక్షన్లోకి దిగి నిరాశ చెందారు. ఈ క్రమంలో వీటన్నింటికీ సమాధానంగా ఈ ఏడాది వచ్చిన 'బలగం' సినిమాతో డైరెక్టర్‌గా తన మొదటి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు జబర్దస్ స్టార్ కమెడియన్ వేణు యెల్దండి. పైగా ఈ చిత్రానికి బడా నిర్మాత దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు.